Bandi Sanjay : కేసీఆర్ కు అలా చెప్పే దమ్ము, ధైర్యం ఉందా? దొంగలంతా అందులోనే ఉన్నారు

నరేంద్ర మోదీ బీసీ ఆత్మగౌరవ సభకు వస్తున్నారు. బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని ఇప్పటికే బీజేపీ అధిష్టానం స్పష్టం చేసింది. కేసీఆర్ కు బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి ని చేస్తానని చెప్పే దమ్ము, ధైర్యం ఉందా అంటూ బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధి బండి సంజయ్ ప్రశ్నించారు.

Bandi Sanjay

Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ ఎంపీ, కరీంనగర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్ధి బండి సంజయ్ ఆ నియోజకవర్గం పరిధిలోని అంబేద్కర్ నగర్ లో ప్రచారం మొదలు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిన్నటి ర్యాలీ ఒక చరిత్ర సృష్టించిందని, స్వచ్ఛదంగా ప్రజలు తరలివచ్చారని, 30వ తేదీన విజయానికి సంకేతం అన్నారు. బండి సంజయ్ భూ దందాలు చేయలేదు.. కబ్జాలు చేయలేదని అన్నారు. కరీంనగర్ అభివృద్ధికి నిధులు తీసుకువచ్చింది ఎవరు? అభివృద్ధి అడ్డం‌పడ్డది ఎవరు? అంటూ సంజయ్ ప్రశ్నించారు. నన్ను అసెంబ్లీలో అడుగు పెట్టకుండాచేసేందుకు వేలకోట్లు కరీంనగర్ కు పంపుతున్నారని సంజయ్ ఆరోపించారు. కరీంనగర్ లో నాపై పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాకపోతే గుడ్డిలోమెల్లలాగా గంగులకి టికెట్ ఇచ్చారని సంజయ్ అన్నారు.

Also Read : Telangana Congress Third List : సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి పోటీ.. కాంగ్రెస్ మూడో జాబితా విడుదల

మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కొడుకు కాకపోతే ఎవరూ దేకరని సంజయ్ అన్నారు. కేటీఆర్ వి అహంకార పూరిత మాటలు. బీఆర్ఎస్ గెలిస్తే జాబ్ క్యాలెండర్‌ అనౌన్స్ చేస్తానని ఇప్పుడు చెబుతున్నారు. టీఎస్పీఎస్సీ సమస్య చిన్నదని‌ కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నిరుద్యోగుల ఆశలు అడియాశలు అయ్యాయి. నిరుద్యోగుల సమస్యల పరిష్కాకోసం బీజేపీ పోరాటం చేస్తే జైలుకు పంపారంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాధి. సంవత్సరంలో మోదీ పది లక్షల ఉద్యోగాలు ఇచ్చారని సంజయ్ అన్నారు.

Also Read : Rashmika : రష్మిక మార్ఫింగ్ వీడియో పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్..

నరేంద్ర మోదీ బీసీ ఆత్మగౌరవ సభకు వస్తున్నారు. బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని ఇప్పటికే బీజేపీ అధిష్టానం స్పష్టం చేసింది. కేసీఆర్ కు బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి ని చేస్తానని చెప్పే దమ్ము, ధైర్యం ఉందా? గతంలో చెప్పినట్లు ఎస్సీని ముఖ్యమంత్రిగా చేస్తావా? అంటూ సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం అహంకారానికి, తెలంగాణ ప్రజలకు జరుగుతున్న పోరాటం ఈ ఎన్నికలు. కేసీఆర్ రాజ్యాంగం కావాలా.. అంబేద్కర్ రాజ్యాంగం కావాలా ప్రజలు ఈ ఎన్నికల్లో ఓటుద్వారా చెప్పాలని సంజయ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం లో దొంగలంతా బీఆర్ఎస్ పార్టీలో చేరారని సంజయ్ విమర్శించారు. ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి.. ప్రశ్నించే గొంతుని అణచివేయకండి.. గెలిపించండి అంటూ ప్రజలకు సంజయ్ విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ లో గెలిచివారు బీఅర్ఎస్ లోకి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీలోఉన్న యాభై మంది అభ్యర్థులకు కేసీఆర్ పండింగ్ చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్, బీఅర్ఎస్, ఎంఐఎంలు‌ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నాయని, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బీజేపీని గెలిపించాలని బండి సంజయ్ ఓటర్లను కోరారు.

ట్రెండింగ్ వార్తలు