Rashmika : రష్మిక మార్ఫింగ్ వీడియో పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్..

రష్మిక మార్ఫింగ్ వీడియో పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Rashmika : రష్మిక మార్ఫింగ్ వీడియో పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్..

MLC Kalvakuntla Kavitha tweet on Rashmika Mandanna Morphing Video

Rashmika : రష్మిక మందన్నకి సంబంధించిన మార్ఫింగ్ వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం పై పలువురు ప్రముఖులు సీరియస్ అవుతున్నారు. ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం అంటూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే అమితాబ్ బచ్చన్, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వంటి వారు కూడా స్పందిస్తూ ట్వీట్స్ చేశారు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా ఈ విషయం పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా రియాక్ట్ అయ్యారు.

కవిత ట్వీట్.. “రష్మిక మందన్న ఫేక్ మార్ఫింగ్ వీడియో సైబర్ ముప్పు గురించి మహిళలకు ఒక హెచ్చరిక లాంటిది. మహిళలను సైబర్ ముప్పు నుంచి రక్షించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం పై ఉంది. దీని పై తగిన చర్యలు తీసుకునేలా ప్రత్యేక పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలి” అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ని ట్యాగ్ చేస్తూ ఆమె ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Also read : Baby Movie : బేబీ మూవీ బాలీవుడ్‌ రీమేక్ అనౌన్స్.. హీరోహీరోయిన్స్ ఎవరు..?

ఇక రష్మిక కూడా ఈ విషయం పై రియాక్ట్ అవుతూ ట్వీట్ చేశారు. ఆ మార్ఫింగ్ వీడియో ఆమెను చాలా భయానికి గురి చేసినట్లు చెప్పుకొచ్చారు. ఒకవేళ తను చదువుతున్న టైములో ఇలా జరిగి ఉంటే దానిని తట్టుకోవడం అనేది ఉహించుకోలేనిదని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు పై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆమె కోరారు. ఇక ఈ విషయంలో ఆమెకు సపోర్ట్ గా నిలిచిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వెల్ విషర్స్ కి చాలా థాంక్యూ చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు.