×
Ad

Rythu Bharosa : తెలంగాణలోని రైతులకు గుడ్‌న్యూస్.. రైతు భరోసాపై సర్కార్ కీలక అప్డేట్.. డబ్బులు పడేది అప్పుడే!

Rythu Bharosa : రైతు భరోసా సాయం కోసం రైతులకు నిరీక్షణ తప్పేలా లేదు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ జారీ నేపథ్యంలో రాష్ట్రంలో ఈ పథకం కొంతకాలం జాప్యం కానుంది.

Rythu Bharosa

Rythu Bharosa : రాష్ట్రంలోని రైతులు ‘రైతు భరోసా’ పథకం కింద ప్రభుత్వం అందజేసే యాసంగి పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, ఫిబ్రవరి మొదటి వారంలో రైతు భరోసా నిధులు అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వ వర్గాలు ఇటీవల పేర్కొన్నాయి. అయితే, రాష్ట్రంలో తాజా పరిణామాల నేపథ్యంలో రైతు భరోసాకు ఇంకా సమయంపట్టేం అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : Ktr: పురపోరు ఇంచార్జ్‌లపై కేటీఆర్ సీరియస్.. వారికి ఇచ్చిన వార్నింగ్‌ ఏంటి?

రైతు భరోసా సాయం కోసం రైతులకు నిరీక్షణ తప్పేలా లేదు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ జారీ నేపథ్యంలో రాష్ట్రంలో ఈ పథకం కొంతకాలం జాప్యం కానుంది. రైతు భరోసా నిధుల జమ ప్రక్రియ ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఆర్థిక శాఖ ఇప్పటికే రూ.8వేలకోట్ల నిధుల సమీకరణలో ఉంది. అయితే, బడ్జెట్ కసరత్తు , కేంద్ర సాయాలు, రాష్ట్ర తాజా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక పరిస్థితులు పెద్దగా ఆశాజనకంగా లేవు. అయినప్పటికీ ప్రభుత్వం ఈ పథకం అమలు చేయాలని భావిస్తుంది. అర్హులకే లబ్ధి చేకూర్చాలనే యోచన కారణంగా స్వల్ప ఆటంకాలు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

సాగులో ఉన్న భూములను పక్కాగా గుర్తించేందుకు ప్రభుత్వం చేపట్టిన శాటిలైట్ సర్వే కారణంగా ఈ జాప్యం జరుగుతోంది. అగ్రికల్చర్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సర్వే నివేదిక అందాక కేవలం పంట సాగు చేస్తున్న రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు అందనున్నాయి. సాగు చేయని భూములకు ఈసారి నిధులు జమ నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పారదర్శకత కోసమే ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.