Minister Harish Rao: మంత్రి హరీష్‌రావుకు తృటిలో తప్పిన ప్రమాదం
మంత్రి హరీష్‌రావుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. సిద్ధిపేట నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా హరీష్ రావు కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. రోడ్డుకు అడ్డుగా జంతువు రావడంతో డ్రైవర్ బ్రేక్ వేయగా.. ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

Telangana Finance Minister Harish Rao Narrowly Missed The Accident
Telangana Finance Minister Harish Rao: మంత్రి హరీష్‌రావుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.. సిద్ధిపేట నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఆయన కాన్వాయ్ ప్రమాదానికి గురైంది.. రోడ్డుకు అడ్డుగా జంతువు రావడంతో డ్రైవర్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.. ఈ ప్రమాదంలో డ్రైవర్, గన్‌మెన్‌కు గాయాలయ్యాయి.. ప్రమాద సమయంలో మంత్రి హరీష్‌రావు మరో వాహనంలో ఉన్నారు..
కొండపాక మండలం బందారం దర్గా కమాన్ సమీపంలో కన్వాయ్‌లో వాహనాలు ఒకదానికి ఒకటి గుద్దుకోగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మంత్రికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.