Telangana : మోసం చేసిన దొర..దగా పడ్డ జనం అంటూ రసమయి బాలకిషన్‌‌పై సెటైర్లు

ఇల్లంతకుంట మండలానికి ఎన్నో హామీలు ఇచ్చి ఏవీ అమలు చేయాలేదని హామీలు ఇవ్వటం తప్ప వాటి ఊసే లేదని మోసం చేసిన దొర..దగా పడ్డ జనం అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Telangana : మోసం చేసిన దొర..దగా పడ్డ జనం అంటూ రసమయి బాలకిషన్‌‌పై సెటైర్లు

Rasamai Balakishan

Updated On : April 19, 2023 / 3:11 PM IST

Telangana : మానకొండూరు నియోజక వర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిసాయి. మోసం చేసిన దొర..దగా పడ్డ జనం అంటూ సెటైర్లు వేస్తు బాలకిషన్ కు వ్యతిరేకంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో కొంతమంది ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇల్లంతకుంట మండలానికి ఎన్నో హామీలు ఇచ్చి ఏవీ అమలు చేయాలేదని విమర్శించారు. హామీలు ఇవ్వటం తప్ప వాటి ఊసే లేదని మోసం చేసిన దొర..దగా పడ్డ జనం అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ నేతకు వ్యతిరేకంగా వెలసిన ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు.

కాగా ప్రజాగాయడకుడి ఉండే రసమయి బాలకిషన్ తెలంగాణ ఉద్యమ సమయంలో తన గొంతును వినిపించారు. వేదికలపై పాటలు పాడుతు ఉద్యమాన్ని ఉర్రూతలూగించారు. అప్పటి టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండేవారు. దీంతో రాష్ట్రం ఏర్పడ్డాక బాలకిషన్ కు సముచిత స్థానాన్ని ఇచ్చారు సీఎం కేసీఆర్. కవి గాయడకుడు అయిన బాలకిషన్ కు తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ గా నియమించారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో బాలకిషన్ సాంస్కృతిక బృందానికి నాయకత్వం వహించారు. తెలంగాణ ధూం ధాం కమిటీకి కన్వీనరుగా వ్యవహరించారు. 2014 సాధారణ ఎన్నికలలో కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018లో ఎన్నికల్లో మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రసమయి బాలకిషన్‌ను తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌గా నియమిస్తూ 13 జులై 2021న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.