Sankranti Holidays: తెలంగాణలో విద్యార్థులకు ప్రభుత్వం జనవరి 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. పాఠశాల విద్య డైరెక్టర్ నవీన్ నికోలస్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ ఉంది. పాఠశాలలు తిరిగి జనవరి 17న పునః ప్రారంభం అవుతాయి. తెలంగాణలోని అన్ని స్కూళ్లకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.
మరో హిందూ యువకుడిని బహిరంగంగా కాల్చి చంపిన బంగ్లాదేశీయులు.. 3 వారాల్లో ఐదో హత్య
కాగా, సంక్రాంతి వేళ ఇప్పటికే రైళ్లు, బస్సుల బుకింగులు అయిపోతున్నాయి. పిల్లలకు సెలవులు రావడంతో ఇక పట్టణాలు ఖాళీ అవుతాయి. ప్రజలు గ్రామాల బాటపడతారు. దీంతో రోడ్లు, రైళ్లు, బస్సులు ప్రయాణికులతో నిండిపోతాయి. ఇప్పటికే రైల్వే శాఖ అదనపు రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది.