Indiramma sarees : ఇందిరమ్మ చీరలు వచ్చేస్తున్నాయ్.. పంపిణీకి సిద్ధంగా 50లక్షల శారీస్.. ఒక్కో చీర తయారీకి ఖర్చు ఎంతంటే?

Indiramma sarees : తెలంగాణ ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది.

Indiramma sarees

Indiramma sarees : తెలంగాణ ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 50లక్షల చీరలు తయారీ పూర్తికాగా.. మరో 10లక్షలు ప్రాసెసింగ్ లో ఉన్నాయి. అయితే, ఈనెల 23వ తేదీ నుంచి ఈ చీరలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

Also Read: BC Reservations: బీసీ కోటా.. రేవంత్ సర్కార్ సరికొత్త స్కెచ్? రిజర్వేషన్ల దుమారాన్ని సేఫ్‌గా దాటగలదా?

గత ప్రభుత్వం బతుకమ్మ చీరలు రేషన్ కార్డుల ఆధారంగా చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుత రేవంత్ సర్కార్ ఇందిరమ్మ చీరలను స్వయం సహాయ సంఘాల గ్రూపుల ద్వారా అందించనున్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు రెండు చీరలు పంపిణీ చేసేందుకు తొలుత నిర్ణయించినట్లు తెలిసింది. అయితే, ప్రస్తుతం దసరా పండుగకు ఒకటి, జనవరిలో సంక్రాంతికి మరొక చీరను పంపిణీ చేయాలని రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో సిరిసిల్ల చేనేత కార్మికులకు చీరల తయారీకి ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే 50 లక్షల చీరల తయారీ పూర్తికాగా.. మరో 10లక్షల చీరలు తయారీలో ఉన్నాయి. మరో 5లక్షల చీరలు లూమ్స్ పై నుంచి ప్రొక్యూర్ స్టేజ్ కు వచ్చాయి. చీరల ప్రొక్యూర్ మెంట్ కోసం ఈనెల 15వ తేదీ వరకు గడువు ఉండగా.. దానిని ఈ నెల 30వ తేదీ వరకు పొడగించారు.

ఇందిరమ్మ చీరలను సెర్ప్, మెప్మా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు. తయారీ పూర్తయిన చీరలను టెస్కో ఆఫీసర్లు ఆయా జిల్లాలకు పంపిస్తున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు.

ప్రభుత్వం ఇచ్చే చీరలు లైట్ బ్లూ కలర్, డార్క్ బ్లూ అంచుతో తయారు చేశారు. బ్లూ కలర్ తో ఉన్న ఈ చీరల మీద తెల్లని రంగు పువ్వులను ముద్రించారు. కాగా.. చీర బ్లౌజ్ తో కలిపి 6.3 మీటర్లు ఉంటుందని తెలుస్తుంది. సీనియర్ సిటిజన్ మహిళలకు బ్లౌజ్ పీస్‌తో కలిపి 9మీటర్ల చీర ఇవ్వనున్నారు. అయితే, ఒక్కో చీర తయారీకి దాదాపు రూ. 800 వరకు ఖర్చు అయినట్లు అధికారులు చెబుతున్నారు.