Ration Cards: రేషన్ కార్డుదారులకు కీలక అప్‌డేట్‌.. అందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు.. పంపిణీ ఎప్పటినుండంటే?

రాష్ట్రంలో దాదాపు 90లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు లక్షల సంఖ్యలో ఉన్నారు. వారిలో ..

Ration Cards: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పాత, కొత్త కార్డుదారులకు అందరికీ స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులను అందజేయనుంది. ప్రతి స్మార్ట్ రేషన్ కార్డుకు ఓ క్యూఆర్ కోడ్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కార్డుకు ఒకవైపు ప్రభుత్వ లోగో, కుటుంబ పెద్ద వివరాలు, హోలోగ్రామ్, మరోవైపు కార్డుదారుడి పూర్తి చిరునామా, క్యూఆర్ కోడ్ ముద్రించనున్నారు. ఇందుకోసం పౌరసరఫరాల శాఖ టెండర్లను ఆహ్వానించింది. 25వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు టెండర్ల దాఖలుకు అవకాశం కల్పించింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి కోటి, దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న వారికి 20లక్షల చొప్పున మొత్తం 1.20 కోట్ల రేషన్ కార్డుల ముద్రణకు పౌరసరఫరాల శాఖ టెండర్లు పిలిచింది.

Also Read: Gossip Garage : ఆ ముగ్గురు మళ్లీ కారెక్కడం ఖాయమా? జంపింగ్‌ ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్‌ వైపు చూస్తున్నారా, కారణం అదేనా..

రాష్ట్రంలో దాదాపు 90లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు లక్షల సంఖ్యలో ఉన్నారు. వారిలో జిల్లాల వారిగా ప్రభుత్వం అర్హులను గుర్తించింది. వాస్తవానికి అర్హులైన వారికి ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో మార్చి 1వ తేదీ నుంచి, మిగతా జిల్లాల్లో మార్చి 8వ తేదీ తరువాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, స్మార్ట్ కార్డు రూపంలో రేషన్ కార్డులు ఇవ్వనున్న నేపథ్యంలో కార్డుల జారీ ప్రక్రియ ఆలస్యమవుతుందని అధికారులు చెబుతున్నారు.

Also Read: Gossip Garage : రాములమ్మ ఎంట్రీతో ఎవరికి ఇబ్బందికరంగా మారింది? ఏ లీడర్‌కు చెక్‌ పెట్టేందుకు తీసుకొచ్చారు?

ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు ఇవ్వనున్న స్మార్ట్ కార్డులో ముందువైపు తెలంగాణ ప్రభుత్వ లోగో, రేషన్‌కార్డు నంబర్‌, కుటుంబ పెద్ద పేరు, రేషన్‌ షాపు నంబర్‌, హోలోగ్రామ్‌, సంబంధిత అధికారి సంతకం ఉంటుంది. కార్డు వెనుక వైపు భాగంలో జిల్లా పేరు, మండలం, గ్రామం, క్యూ ఆర్‌ కోడ్‌, రేషన్‌ కార్డుదారుడి చిరునామా ఉంటుంది. రేషన్ షాపునకు వెళ్లి క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయగానే ఆ కుటుంబంలో రేషన్ అర్హుల వివరాలన్ని వస్తాయని సమాచారం. ఈ విధానానికి సంబంధించి తెలంగాణ ఉన్నతాధికారుల బృందం రాజస్థాన్, కర్ణాటక, హరియాణా, గుజరాత్ రాష్ట్రాల్లో గతేడాదే అధ్యయనం చేసింది.

 

కొత్త కార్డుల ముద్రణ కోసం మంగళవారమే టెండర్లను పౌరసరఫరాల శాఖ ఆహ్వానించింది. కొత్తగా అందించనున్న రేషన్ కార్డులు గతంలో కంటే భిన్నంగా ఉండనున్నాయి. 760 మైక్రాన్స్ మందం, 85.4మి.మీ పొడవు, 54 మి.మీ వెడల్పు ఉండే పీవీసీ కార్డుపై రేషన్ కార్డు వివరాలను పొందుపర్చనున్నారు. దీని ప్రకారం.. ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డు ఉండనున్నట్లు తెలుస్తోంది.