Governor Tamilisai Soundararajan: మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసై

నేను తెలంగాణ గవర్నర్‌గా వచ్చినప్పుడు రాష్ట్ర క్యాబినెట్‌లో మహిళా మంత్రులు లేరు. నేను గవర్నర్ అయిన తర్వాత మహిళ మంత్రులతో ప్రమాణం చేయించిన పరిస్థితి అని తమిళిసై అన్నారు.

Telangana Governor Tamilisai Soundararajan

Telangana Governor: గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్ భవన్‌లో గవర్నర్ అధ్యక్షతన మహిళా సమ్మేళనం జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించినందుకు కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో పలు రంగాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read Also : KA Paul : ఆ పార్టీల నుంచి నేతలు ప్రజాశాంతి పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు : కేఏ పాల్

నేను తెలంగాణ గవర్నర్‌గా వచ్చినప్పుడు రాష్ట్ర క్యాబినెట్‌లో మహిళా మంత్రులు లేరు. నేను గవర్నర్ అయిన తర్వాత మహిళ మంత్రులతో ప్రమాణం చేయించిన పరిస్థితి అని తమిళిసై అన్నారు. ప్రోటోకాల్ ఇచ్చిన, ఇవ్వకున్న పని చేసుకుంటూ పోవాలి. నా మీద రాళ్ళు విసిరితే వాటితో భవంతులు కడతా. దాడిచేసి రక్తం చూస్తే ఆ రక్తంను సిరగా మార్చి నా చరిత్ర రాస్తా అని తమిళిసై వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో అవకాశాలకోసం మహిళలు చాలా కష్ట‌పడాల్సి ఉంటుంది.

గవర్నర్ కంటే ముందు నేను రాజకీయ నాయకురాలిని. దాంట్లో రహస్యం దాచి పెట్టడానికి ఏమీలేదు. తెలంగాణలో కొందరు నన్ను రాజకీయ నాయకురాలు అంటారు. అది నిజమే కదా అంటూ తమిళిసై అన్నారు. ఇదిలాఉంటే తమిళిసై సౌందరరాజన్ శనివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు.