KA Paul : ఆ పార్టీల నుంచి నేతలు ప్రజాశాంతి పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు : కేఏ పాల్

తెలంగాణ ప్రజలు కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని..కుటుంబ పాలన కావాలో దళితుల పాలన కావాలో తేల్చుకోవాలని సూచించారు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేఏపాల్.

KA Paul : ఆ పార్టీల నుంచి నేతలు ప్రజాశాంతి పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు : కేఏ పాల్

ka paul

ka paul Telangana politics : తెలంగాణ ప్రజలు కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని..కుటుంబ పాలన కావాలో దళితుల పాలన కావాలో తేల్చుకోవాలని సూచించారు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేఏపాల్. వరంగల్ జిల్లాలో మీడియాతో మాట్లాడుతు..119 నియోజకవర్గంలో 3600 మంది ఎమ్మెల్యేలు గా పోటీచేయడానికి రెడిగా ఉన్నారని..కీలక పార్టీల నుండి 8 నుంచి 10 మంది ప్రజా శాంతి పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈటెల రాజేందర్, కొండ సురేఖ, తలసాని శ్రీనివాస్ వంటి నేతలు ప్రజా శాంతి పార్టీతో పనిచేయడానికి నాతో మాట్లాడారు అంటూ చెప్పుకొచ్చారు.రేవంత్ రెడ్డి ఒక్కొక్కరికి 100 కోట్ల ఆఫర్ ఇస్తున్నారు అంటూ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అంత అవినీతి పార్టీ దేశంలో లేదు అంటూ దుయ్యబట్టారు.ప్రతి సర్వే లో ప్రజాశాంతి పార్టీ ముందు ఉందని..గెలుపు తథ్యం అంటూ ధీమా వ్యక్తంచేశఆరు. 10 మందిలో ఎనిమిది మంది పాల్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని అన్నారు.

90 శాతం ఉన్న బడుగుబాలహీన వర్గాల పార్టీని గెలిపించుకుందాం అంటూ ఈ సందర్భంగా పాల్ పిలుపునిచ్చారు. తెలంగాణలో బానిసలుగా ఉంటున్న ప్రజలు కళ్లు తెరవాలని సూచించారు. కేసీఆర్ కి ఓట్లు వేస్తే కాంగ్రెస్ కి వేసినట్టే,, కాంగ్రెస్ కి ఓట్లు వేస్తే కేసీఆర్ కు వేసినట్లేనని అన్నారు.వీళ్లంతా నా ఆశీస్సులు తీసుకున్నవారే అంటూ కేఏ పాల్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.