Telangana : తెలంగాణలో 1,827 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

తెలంగాణ ప్రభుత్వం స్టాఫ్ నర్సుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1827 స్టాఫ్ నర్సులో పోస్టులను భర్తీ చేయనుంది.

telangana govt staff nurse posts

Telangana : తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా స్టాఫ్ నర్సుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని టీచింగ్ ఆస్పత్రుల్లో 1827 స్టాఫ్ నర్సులో పోస్టులను భర్తీ చేయనుంది. దీని సంబందించి అనుమతులు మంజూరు చేస్తు శుక్రవారం (జూన్ 23,2023) ఉత్తర్వులు జారీ చేసింది.జీవో కాపీని మంత్రి హరీశ్ రావు ట్వీట్టర్ లో షేర్ చేశారు. తెలంగాణ మెడికల్ హెల్త్ అండ్ రిక్రూట్ మెంట్ బోర్డు డైరెక్ట్ రిక్రూట్ మెంట్ పద్ధితిన ఈ ఖాళీలను భర్తీ చేయనుంది.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కృషి చేస్తోంది. దీంట్లో భాగంగానే జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. పేదలకు కూడా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని కేసీఆర్ భావిస్తున్నారని అన్నారు. అందుకోసం తెలంగాణలో మరో ఎనిమిది మెడికల్ కాలేజీల ఏర్పాటుకు తగిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.