Telangana Govt Release Gazette
telangana govt Release Gazette : ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితి పెంపుపై తెలంగాణ ప్రభుత్వం ఇవాళ గెజిట్ విడుదల చేసింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ఇటీవల జరిగిన శాసనసభ సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ఉభయ సభల్లో ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు బిల్లుకు ఆమోదం తెలిపి రాష్ట్రపతికి పంపారు. ఇవాళ రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పింఛన్, వైద్య చికిత్స వ్యయం పెంపు.. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ద్రవ్య వినిమయ బిల్లులను సైతం ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో ఆమోదించి రాష్ట్రపతికి పంపింది. వీటికి ఆమోదం లభించడంతో అమల్లోకి తెస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.