Group 1: గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాలను పునర్ మూల్యాంకనం చేయించాలని హైకోర్టు సింగిల్ జడ్జి తాజాగా తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. పునర్ మూల్యాంకనం చేయలేకపోతే పరీక్షలను రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని అన్నారు.
ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. టీజీపీఎస్సీ బుధవారం న్యాయనిపుణులతో ఈ విషయంపై చర్చించింది. ఆ తర్వాత టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం సర్కారుకి రిపోర్టు పంపినట్లు సమాచారం.
సర్కారు అనుమతి ఇచ్చాక టీజీపీఎస్సీ రివ్యూ పిటిషన్ దాఖలు చేసే ఛాన్స్ ఉంది. గ్రూప్-1 ఫైనల్ లిస్ట్‌లో ఉన్న అభ్యర్థులు కూడా సింగిల్ జడ్జి ధర్మాసనం తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ప్రేమించి పెళ్లి చేసుకుని.. ఆస్తి కోసం భర్తతో కలిసి కన్నతల్లిని దారుణంగా హత్య చేసి..
తమకు ఉద్యోగాల నియామక పత్రాల అందజేత మాత్రమే మిగిలి ఉన్న సమయంలో తీర్పు రావడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. వారు డివిజన్ బెంచ్‌కు వెళ్లే అవకాశం ఉంది. (Group 1)
అక్కడ తమకు అనుకూలంగా తీర్పు రాకపోతే సుప్రీంకోర్టుకు సైతం వెళ్దామని భావిస్తున్నారు. గ్రూప్-1 పరీక్ష ఫలితాలపై వచ్చిన తీర్పుతో గ్రూప్-2, గ్రూప్-3 పోస్టుల నియామకాలపైనా ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది.
ఎందుకంటే, గ్రూప్-1 పోస్టులు భర్తీ చేశాకే గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులు భర్తీ చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. జాబ్ క్యాలెండర్ కూడా ఆలస్యం కానుంది.