IAS Amrapali
IAS Amrapali: ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో నిరాశ ఎదురైంది. గతంలో ఆమ్రపాలిని తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని క్యాట్ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది.
క్యాట్ జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆమ్రపాలికి హైకోర్టు సూచించింది. (IAS Amrapali)
Also Read: వారికి వందేమాతరం గేయం చిరాకు తెప్పిస్తుందని నెహ్రూ భావించారు: లోక్‌సభలో మోదీ
కాగా, ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తూ రెండు నెలల క్రితం డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో క్యాట్‌లో ఆమ్రపాలి సవాల్ చేశారు. ఆమెను తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఆదేశాలు జారీ చేసింది.
అయితే, ఆ ఉత్తర్వులపై హైకోర్టులో డీవోపీటీ అప్పీల్ చేసింది. దీనిపైనే విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఇవాళ క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.