Lockdown: తెలంగాణలో లాక్‌డౌన్ సమయంలో ఏం ఓపెన్ ఉంటాయంటే..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా లాక్ డౌన్ అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైకోర్టు జోక్యంతో ఈ దిశగా అడుగులు వేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి

Telangana Cabinet Takes Decision On Covid 19 Lockdown

Lockdown: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా లాక్ డౌన్ అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైకోర్టు జోక్యంతో ఈ దిశగా అడుగులు వేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావొద్దంటూ సూచించారు. కాసేపట్లో లాక్ డౌన్ మార్గదర్శకాలు ప్రభుత్వం విడుదల చేయనుంది. కరోనా కట్టడి కోసమే లాక్ డౌన్ విధించామని ప్రభుత్వం తెలియజేసింది.

పదిరోజుల పాటు తెలంగాణలో లాక్ డౌన్ విధించనున్నారు. అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతులు ఇవ్వనున్నారు. టీకా కోసం వెళ్లేవారికి మాత్రం లాక్ డౌన్ నుంచి మినహాయింపు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో మళ్లీ విచారణ ప్రారంభమైంది.

ఉదయం 6గంటల నుంచి 10గంటల లోపు
* షాపులు దుకాణాలు ఓపెన్
* రవాణాపై నో కండిషన్స్
* మెడికల్ షాపులు ఓపెన్
* ప్రజలందరికీ అనుమతి

ఉదయం 6గంటల నుంచి 10గంటల తర్వాత
* షాపులు దుకాణాలు క్లోజ్
* రవాణా మొత్తం బంద్
* మెడికల్ షాపులకు అనుమతి
* ఫ్రంటలైన్ వర్కర్స్, కొవిడ్ వారియర్స్ కు మాత్రమే ఎంట్రీ