Minister Vemula: ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవసరం మాకు లేదు: తెలంగాణ మంత్రి వేముల
ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవసరం తమకు లేదని తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇవాళ నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలో ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొని, ఈ సందర్భంగా మాట్లాడారు. తాము పూర్తి కాలం అధికారంలో ఉంటామని స్పష్టం చేశారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ఇంకా 9 నెలల కాలం ఉందని చెప్పారు.

Minister Vemula
Minister Vemula: ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవసరం తమకు లేదని తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇవాళ నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలో ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొని, ఈ సందర్భంగా మాట్లాడారు. తాము పూర్తి కాలం అధికారంలో ఉంటామని స్పష్టం చేశారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ఇంకా 9 నెలల కాలం ఉందని చెప్పారు.
ఎంపీ అర్వింద్ చేస్తున్న వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని, రాజకీయాల కోసం కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నారని చెప్పారు. అర్వింద్ రైతులను మోసం చేశారని ఆయన చెప్పారు. పసుపు బోర్డు తీసుకువస్తానని చెప్పి, ఆ మాట తప్పారని అన్నారు. తాము పేదలకు సీఎంఆర్ఎఫ్ అందిస్తున్నామని, అలాగే, ప్రధానమంత్రి నుంచి పీఎంఆర్ఎఫ్ వచ్చేలా చేయాలని అర్వింద్ ను అడిగితే ఆయన వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని చెప్పారు.
ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులుగా చేరాలంటే సైకిల్ మోటార్ ఉన్న కుటుంబాలు అర్హులు కాదని మోదీ సర్కారు చెప్పిందని అన్నారు. ఈ కాలంలో అందరికీ సైకిల్ మోటార్ ఉంటుందని చెప్పారు. తాము బాల్కొండ నియోజకవర్గంలో సీసీ రోడ్లకు నిధులు కేటాయించామని చెప్పారు. సీఎం కేసీఆర్ దృష్టి అంతా అభివృద్ధిపైనే ఉంటుందని అన్నారు.