Paddy Procurement
Paddy Procurement : రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్ల విషయంపై కేంద్రంతో చర్చించేందుకు తెలంగాణ మంత్రుల బృందం రెండు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లిన విషయం విదితమే.. రెండు రోజుల నిరీక్షణ అనంతరం ఈ రోజు కేంద్ర ఆహార, ప్రజా పంపిణి వ్యవహారాల శాఖమంత్రి పీయూష్ గోయల్‌తో మంత్రుల బృందం సమావేశం కానుంది. పార్లమెంట్ సమావేశాలతో రెండు రోజులు బిజీగా ఉన్న కేంద్రమంత్రి గోయల్.. మంగళవారం మధ్యాహ్నం 2.30 నిమిషాలకు అపాయింట్మెంట్ ఇచ్చారు.
చదవండి : Paddy Procurement : ఢిల్లీకి చేరిన తెలంగాణ మంత్రులు… వరి కొనుగోలుపై కేంద్రంతో చర్చలు
వరి ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ మంత్రుల బృందం గతంలో కూడా గోయల్ తో భేటీ అయింది. గత భేటీలో కేంద్రం వరిధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇచ్చింది.. అయితే లిఖితపూర్వక హామీ మాత్రం ఇవ్వలేదు. ఈ సమావేశంలో లిఖిత పూర్వక హామీ ఇవ్వవలసిందిగా మంత్రులు కోరే అవకాశం ఉంది. ఇక బాయిల్డ్ రైస్ విషయంపై కూడా మంత్రులు, కేంద్ర మంత్రితో చర్చించనున్నారు.
చదవండి : Yasangi Paddy Crop : యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి-నిరంజన్ రెడ్డి