ED notices to TRS MLA Rohit Reddy
MLA Rohit reddy: బీజేపీ నేతల బండారాన్ని బయటపెట్టినందుకే తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆరోపించారు. ఈడీ, సీబీఐ, ఐటీలను తనపైకి ఉసిగొల్పుతున్నారని అన్నారు. అయినప్పటికీ బీజేపీకి లొంగేదే లేదని చెప్పారు. ఈడీ విచారణపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీ కుట్రలను బయటపెట్టానని, ఫిర్యాదుదారుడినే విచారణకు పిలిచి వేధిస్తున్నారని ఆయన అన్నారు.
దొంగే మరొకరిని దొంగా అన్నట్లుగా బీజేపీ తీరు ఉందని రోహిత్ రెడ్డి విమర్శించారు. బీజేపీకి అనుకూలంగా నందూ వాంగ్మూలాన్ని తీసుకోవాలని ఈడీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. తనపై కుట్రలు పన్ని, నేరస్థుడిగా చూపేలా నందకుమార్ నుంచి వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని అనుకుంటున్నారని చెప్పారు.
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలను కూల్చి వేసిందని రోహిత్ రెడ్డి అన్నారు. తెలంగాణలోనూ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్రలు పన్ని, అవి ఫలించకపోవడంతో ఓర్వలేకపోతోందని చెప్పారు. ఈడీ నోటీసులపై హైకోర్టును ఆశ్రయిస్తానని అన్నారు.
Father of New India Row: మోదీని ‘న్యూ ఇండియా’ జాతిపితగా అభివర్ణించడం ఆయనకే అవమానం: సంజయ్ రౌత్