Telangana New Secretariat : ఫిబ్రవరి 17న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం

తెలంగాణ నూతన సచివాలయం 2023, ఫిబ్రవరి 17వ తేదీన ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ పుట్టిన రోజున కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. 2019 జూన్ 27న నూతన సచివాలయానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు.

Telangana New Secretariat : ఫిబ్రవరి 17న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం

New Secretariat

Updated On : January 15, 2023 / 1:55 PM IST

Telangana New Secretariat : తెలంగాణ నూతన సచివాలయం 2023, ఫిబ్రవరి 17వ తేదీన ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ పుట్టిన రోజున కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. 2019 జూన్ 27న నూతన సచివాలయానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. ప్రస్తుతం నిర్మాణం పనులు పూర్తి కావచ్చాయి. తెలంగాణకు తలమానికంగా నిర్మాణం అవుతున్న కొత్త సచివాలయాన్ని రూ.610 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది.

నిజాం సర్కార్ కట్టడాలను పోలిన నిర్మాణంలో న్యూ సెక్రటేరియట్ ను నిర్మిస్తున్నారు. 26.29 ఎకరాల్లో నూతన సచివాలయం నిర్మాణం జరుగుతోంది. 11.45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సెక్రటేరియట్ నిర్మిస్తున్నారు. 278 అడుగుల ఎత్తులో సచివాలయం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ తో కలిసి మొత్తం ఏడు ఫ్లోర్లతో నిర్మాణం జరుగుతోంది. రూఫ్ టాప్ లో ప్రత్యేక స్కై లాంజ్ ఉంటుంది.

Dr. BR Ambedkar Telangana Secretariat : తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేద్కర్‌ పేరు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

పటిష్టమైన భద్రత, ఆహ్లాదం పంచే పార్కులతో సుందరంగా నిర్మిస్తున్నారు.  ఆరో అంతస్తులో అత్యాధునిక హంగులతో సీఎం చాంబర్ ఉంటుంది. సీఎం కోసం ప్రత్యేక ద్వారం, స్పెషల్ లిఫ్ట్ ఉంటుంది. సందర్శకుల కోసం ప్రత్యేక వెయిటింగ్ హాల్ ఉంటుంది. 3 సంవత్సరాల 8 నెలల్లో సచివాలయం నిర్మాణం పూర్తైంది.  నూతన సచివాలయం నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది.

వాస్తవానికి ఈరోజు సంక్రాంతి రోజు నూతన సచివాలయాన్ని భావించినప్పటికీ ఇంకా కొన్ని పనులు పెండింగ్ లో ఉండటం వల్ల సచివాలయ ప్రారంభాన్ని ఫిబ్రవరి 17కు వాయిదా వేశారు. అదే రోజు సీఎం కేసీఆర్ జన్మదినం ఉన్నందుకు ఆరోజే సచివాలయం ప్రారంభం కానుండటం ఆసక్తికర అంశంగా చెప్పవచ్చు.

Tirupati sculptures In TS new Secretariat : తెలంగాణ సచివాలంలో కొలువుతీరనున్న తిరుపతి శిల్పాలు

కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పేరును పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కొత్త సచివాలయానికి అంబేద్కర్‌ పేరును ఖరారు చేస్తూ గురువారం(సెప్టెంబర్ 15,2022) రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంగా నామకరణం చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.