Warangal : క్షద్రపూజల కలకలం..వ్యక్తి అదృశ్యం..మంచం పక్కనే మనిషి బొమ్మ..ముగ్గులు

తెలంగాణలోని వరంగల్ జిల్లాలో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. చెన్నారావు పేట మండలంలోని ఓ గ్రామంలో ఓ వ్యక్తి అదృశ్యం కావటం..అతను పడుకున్న మంచం పక్కనే పసుపు, కుంకుమలతో ముగ్గులు వేసి కనిపించటం తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.

Warangal : క్షద్రపూజల కలకలం..వ్యక్తి అదృశ్యం..మంచం పక్కనే మనిషి బొమ్మ..ముగ్గులు

Black Fungal Treatment Injection (1)

Updated On : June 10, 2021 / 3:29 PM IST

Occult worship Tension : ఈ కంప్యూటర్ యుగంలో కూడా మంత్రాలు..మాయలు అంటూ మోసాలు జరుగుతునే ఉన్నాయి.కొంతమంది మంత్రగాళ్ల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ డబ్బులు దోచుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని వరంగల్ జిల్లాలో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. చెన్నారావు పేట మండలంలోని ఓ గ్రామంలో ఓ వ్యక్తి అదృశ్యం కావటం..అతను పడుకున్న మంచం పక్కనే పసుపు, కుంకుమలతో ముగ్గులు వేసి కనిపించటం తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.

చెన్నారావు పేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో సతీష్ అనే వ్యక్తి కనిపించకుండాపోవటం తీవ్ర కలకలం రేపింది. రాత్రి స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపిన సతీష్ ఇంటి బయట మంచం వేసుకుని నిద్రపోయాడు.కానీ తెల్లవారేసరికి కనిపించకుండాపోయాడు. దానికి తోడు సతీష్ పడుకున్న మంచం పక్కనే మనిషి బొమ్మ వేసి ఉంది. ఆ బొమ్మలో పసుపు కుంకుమలతో మనిషి బొమ్మ ముగ్గు వేసి ఉంది. ఆ ముగ్గులో పసుపు కుంకుమలు..నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు వేసి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు.

సతీష్ కనిపించకుండాపోవటంతో కుటుంబ సభ్యులు..స్థానికులు ఆందోళన చెందారు. అనంతరం పోలీసులకు ఫిర్ాయదు చేశారు. కాగా..గతంతో ఇటువంటి ఘటనలోనే ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడని పోలీసులకు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.