Telangana Omicron : తెలంగాణలో ఒమిక్రాన్, 41 కేసుల్లో కోలుకున్నది పది మంది

మొత్తంగా నమోదైన కేసుల సంఖ్య 41కి చేరాయి. అయితే..ఊరట చెందే విషయం ఏంటంటే...చికిత్స పొందుతూ 10 మంది బాధితులు కోలుకున్నారు...

Telangana Omicron : తెలంగాణలో ఒమిక్రాన్, 41 కేసుల్లో కోలుకున్నది పది మంది

Omicron (4)

Updated On : December 25, 2021 / 8:36 PM IST

Telangana 41 Omicron Cases : తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య అధికమౌతుండడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. ఒమిక్రాన్ కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా..ఎక్కడో ఒకచోట కేసులు నమోదవుతున్నాయి. తాజాగా..మరో మూడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తంగా నమోదైన కేసుల సంఖ్య 41కి చేరాయి. అయితే..ఊరట చెందే విషయం ఏంటంటే…చికిత్స పొందుతూ 10 మంది బాధితులు కోలుకున్నారు.

Read More : U19 Asia Cup: ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్తాన్ విజయం

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రికార్డవుతున్నాయి. గత 24 గంటల్లో 140 కరోనా కేసులు నమోదైనట్లు ఒకరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 92 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 3 వేల 499 యాక్టివ్ కేసులుండగా…మొత్తం 4 వేల 021 మంది చనిపోయారు.

Read More : Five States Election : మళ్ళీ ఆంక్షల వలయం..ఎన్నికలు నిర్వహించాలా ? వద్దా ?

మరోవైపు…దేశంలో ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు మళ్లీ ఆంక్షల వలయంలోకి జారుకుంటున్నాయి. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం – కేంద్ర ఆరోగ్యశాఖతో సమావేశంకానుంది. ఈ నెల 27న కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులతో జరగబోయే సమావేశంలో.. దేశంలో ప్రస్తుతం కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్‌ ప్రభావం తదితర అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. అలాగే, యూపీ, పంజాబ్‌ సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.