Corona (4)
Telangana corona cases : తెలంగాణలో కొత్తగా 767 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారిన పడి గత 24 గంటల్లో ఇద్దరు మృతి చెందారు. తెలంగాణలో ప్రస్తుతం 17,754 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 4,105 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 228 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
మరోవైపు ఏపీలో కొత్తగా 1,345 కరోనా కేసులు నమోదు కాగా, మరో నలుగురు కరోనాతో చనిపోయారు. చిత్తూరు, కృష్ణా, కర్నూలు, నెల్లూరు జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కోవిడ్ తో మరణించారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 6వేల 576 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.
Hijab Row : మతపరమైన దుస్తులు వద్దు… హిజాబ్ వివాదంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
ఏపీలో ప్రస్తుతం 40వేల 888 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24గంటల వ్యవధిలో రాష్ట్రంలో 26వేల 393 కరోనా టెస్టులు చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14,683కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 3,27,59,439 కరోనా టెస్టులు చేశారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,09,967. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,54,400.
దేశంలో కొత్తగా 67,084 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,24,78,060కి చేరింది. గడిచిన 24 గంటల్లో 1,241 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 5,06,520కి పెరిగింది. అదే సమయంలో 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 1,67,882 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
AP New Districts : ఏపీలో కొత్త జిల్లాలు.. ఉగాది నుంచే.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
దేశంలో కోవిడ్ యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 7,90,789గా ఉంది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,11,80,751కి చేరింది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 1,71,28,19,947 మందికి వ్యాక్సిన్లు ఇచ్చారు. గడిచిన 24 గంటల్లో 46,44,382 మందికి వ్యాక్సిన్లు వేశారు.