Hijab Row : మతపరమైన దుస్తులు వద్దు… హిజాబ్‌ వివాదంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

తుది తీర్పు వెలువడే వరకు విద్యార్థులు హిజాబ్‌, కాషాయ కండువాల ప్రస్తావన తేవొద్దని స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రశాంతత నెలకొనాల్సిన అవసరం ఉందంది. సోమవారం నుంచి కాలేజీలు, స్కూళ్లు..

Hijab Row : మతపరమైన దుస్తులు వద్దు… హిజాబ్‌ వివాదంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

Hjab Row

Hijab Row : దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కర్నాటకలో హిజాబ్‌ వివాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల డ్రెస్‌ కోడ్‌పై ఎవరూ బలవంతం చేయొద్దని ఆదేశించిన కోర్టు.. సోమవారం నుంచి కాలేజీలు, స్కూళ్లు తెరచుకోవచ్చని సూచించింది. ఎవరూ కూడా మతపరమైన దుస్తుల కోసం పట్టుబట్టకూడదని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశాలు ఇచ్చారు. హైకోర్టు తుది తీర్పు వచ్చేవరకు విద్యార్థులు హిజాబ్, కాషాయం వంటి మతపరమైన దుస్తుల ప్రస్తావన తీసుకురావొద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది న్యాయస్థానం. కోర్టులో ఇష్యూ పెండింగ్ లో ఉంది కాబట్టి.. విద్యార్ధులు హిజాబ్‌లు, కాషాయ కండువాలు ధరించకూడదని సూచించింది. ఈ అంశంపై సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు లేకుండా చూడాలని ప్రభుత్వానికి సూచించింది హైకోర్టు. ఈ కేసులో తదుపరి విచారణను సోమవారానికి(ఫిబ్రవరి 14) వాయిదా వేసింది కోర్టు.

విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై కర్నాటక ప్రభుత్వం నిషేధం విధించింది. దీన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను కర్నాటక హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈరోజు విచారించింది. ఈ వివాదం పెండింగ్ లో ఉన్నంత కాలం విద్యార్థులు మతపరమైన దుస్తులు ధరించరాదని ఆదేశాలు ఇచ్చింది. ఈ పిటిషన్ ను విచారించేందుకు చీఫ్ జస్టిస్ రితు రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ట ఎస్ దీక్షిత్, జస్టిస్ జైబున్నీసా ఎం ఖాజీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనాన్ని నిన్న హైకోర్టు ఏర్పాటు చేసింది.

Google Account : మీ గూగుల్ అకౌంట్లో డేటా భద్రమేనా? ఇలా ప్రొటెక్ట్ చేసుకోండి..!

పాఠశాలల్లో డ్రెస్‌ కోడ్‌పై రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విస్తృత ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. సోమవారం నుంచి విద్యా సంస్థలను పునః ప్రారంభించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంలో తుది తీర్పు వెలువడే వరకు విద్యార్థులు హిజాబ్‌, కాషాయ కండువాల ప్రస్తావన తేవొద్దని స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రశాంతత నెలకొనాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డ కోర్టు.. కేసు విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. అలాగే కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలను సైతం సోషల్‌ మీడియాలో పెట్టొద్దని హైకోర్టు ఆదేశాలిచ్చింది.

హిజాబ్ వివాదం కారణంగా ప్రస్తుతం కర్నాటక రాష్ట్రం అట్టుడుకుతోంది. ఇది ఇలాగే కొనసాగితే మత ఘర్షణలు చెలరేగడం ఖాయమనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. హిజాబ్ ధరించిన విద్యార్థులను క్లాసులకు అనుమతించకపోవడంతో వారు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారం పెద్ద వివాదంగా మారింది.

Weight : బరువు సులభంగా తగ్గాలంటే?

కర్నాటకలో హిజాబ్‌ వస్త్ర ధారణ వివాదం దుమారం రేపింది. హిజాబ్‌, కాషాయ వస్త్రధారణలతో విద్యార్థులు కాలేజీలకు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాగల్‌కోటె, దావణగెరె, మండ్య, బెళగావి, ఉడుపి, శివమొగ్గ, చిక్కమగళూరు, రాయచూరు, కలబురగి, కోలారు తదితర జిల్లాల్లోని కాలేజీల దగ్గర ఇరువర్గాలకు చెందిన విద్యార్థులు ఆందోళనలకు దిగారు. పోటాపోటీగా నినాదాలు చేశారు. కొన్నిచోట్ల రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు గాయపడ్డారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పలుచోట్ల పోలీసులు లాఠీఛార్జి చేసి, బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో ప్రభుత్వం మూడు రోజుల పాటు డిగ్రీ, పీయూ కాలేజీలకు సెలవులు ప్రకటించింది. జనవరిలో ఉడుపిలోని ప్రభుత్వ కాలేజీలో ఆరుగురు విద్యార్థినిలు హిజాబ్‌ ధరించి హాజరయ్యారు. దీంతో వారిని కళాశాలలోకి వచ్చేందుకు అనుమతించ లేదు. పోటీగా హిందూ విద్యార్థులు కాషాయ కండువాలను ధరించి వచ్చారు. ఇలా.. ఇరు వర్గాల మధ్య ప్రారంభమైన వివాదం రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు విస్తరించింది.