AP New Districts : ఏపీలో కొత్త జిల్లాలు.. ఉగాది నుంచే.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

తెలుగు సంవత్సరాది ఉగాది నుంచే రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతాయని జగన్‌ తెలిపారు. కొత్త జిల్లాల నుంచి కలెక్టర్లు, ఎస్పీలు కార్యకలాపాలు సాగించాలని ఆదేశించారు.

AP New Districts : ఏపీలో కొత్త జిల్లాలు.. ఉగాది నుంచే.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

Ap New Districts

AP New Districts : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. తెలుగు సంవత్సరాది ఉగాది నుంచే రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతాయని జగన్‌ తెలిపారు. ఉగాది నుంచే కొత్త జిల్లాల నుంచి కలెక్టర్లు, ఎస్పీలు కార్యకలాపాలు సాగించాలని ఆదేశించారు. సీఎస్, ఇతర ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. కొత్త జిల్లాల ప్రతిపాదనలు, ప్రాతిపదికలను సీఎంకు అధికారులు వివరించారు. కొత్త జిల్లాల మ్యాపులు, జిల్లా కేంద్రాల నిర్ణయం వెనుక తీసుకున్న ప్రాధాన్యతలను వివరించారు. అలాగే ప్రతిపాదనలపై వస్తున్న అభ్యంతరాలు, సలహాలు, సూచనలు కూడా నిశితంగా పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు.

ఉగాది నుంచే కొత్త జిల్లాలు ఉనికిలోకి వచ్చేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు జగన్. అదే రోజు నుంచే కలెక్టర్లు, ఎస్పీల కార్యకలాపాలు ప్రారంభించేలా సన్నాహాలు చేసుకోవాలన్నారు. ఇప్పుడున్న కలెక్టర్లు, ఎస్పీలకు కొత్త జిల్లాల బాధ్యతలు అప్పగించాలని సూచించారు. పరిపాలన సాఫీగా సాగడానికి వీరి అనుభవం కొత్త జిల్లాలకు ఉపయోగపడుతుందని సీఎం జగన్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. కొత్త జిల్లాలపై నోటిఫికేషన్ వచ్చిన రోజునే ఓఎస్డీల హోదాలో కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యతలు నిర్వహిస్తారని జగన్‌ వెల్లడించారు.

Google Account : మీ గూగుల్ అకౌంట్లో డేటా భద్రమేనా? ఇలా ప్రొటెక్ట్ చేసుకోండి..!

”కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత… యంత్రాంగం అంతా సమర్థవంతంగా పనిచేయాలి. కొత్త జిల్లాలో పని ప్రారంభమైన తర్వాత ఎలాంటి అయోమయం ఉండకూడదు, పాలన సాఫీగా ముందుకు సాగాలి. దీనికోసం సన్నాహకాలను చురుగ్గా, వేగంగా, సమర్థవంతంగా మొదలు పెట్టాలి. వచ్చే ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు కావాలి. ఉగాది నాటికి కొత్త జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు.. ఆయా జిల్లా కేంద్రాల నుంచి పని చేయాలి.

Semaglutide Drug : ప్రపంచానికి గుడ్‌న్యూస్.. అధిక బరువును తగ్గించే సరికొత్త డ్రగ్.. ఇదో గేమ్‌ఛేంజర్..!

ఉద్యోగుల విభజన, మౌలిక సదుపాయాల ఏర్పాటు, కొత్త భవనాలు వచ్చేలోగా యంత్రాంగం పని చేయడానికి అవసరమైన భవనాల గుర్తింపు.. అన్ని రకాలుగా కూడా సిద్ధం కావాలి. కొత్తగా మౌలిక సదుపాయాలు ఏర్పాటయ్యేలోగా ప్రత్యామ్నాయంగా ఏర్పాటు కావాల్సిన భవనాలు తదితర వాటిని గుర్తించాలి. అలాగే కొత్త భవనాల నిర్మాణంపైనా ప్రణాళికలను ఖరారు చేయాలి. అందుకోసం స్థలాల గుర్తింపుపై దృష్టిపెట్టాలి. అభ్యంతరాల విషయంలో హేతుబద్ధత ఉన్నప్పుడు దానిపై నిశిత పరిశీలన చేయాలి. నిర్ణయం తీసుకునే ముందు వారితో మాట్లాడటం అన్నది చాలా ముఖ్యం. దీనికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి” అని సీఎం జగన్ అధికారులతో చెప్పారు.

ఏపీలో ఇప్పుడున్న జిల్లాలకు అదనంగా 13 జిల్లాలను కలుపుతూ 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక జిల్లాను ఏర్పాటు చేశారు.

13 జిల్లాలు..

1. మన్యం (ముఖ్య కేంద్రం పార్వతీపురం)
2. అల్లూరి సీతారామారాజు (ముఖ్య కేంద్రం పాడేరు)
3. అనకాపల్లి (ముఖ్య కేంద్రం అనకాపల్లి)
4. కాకినాడ (ముఖ్య కేంద్రం కాకినాడ)
5. కోనసీమ (ముఖ్య కేంద్రం అమలాపురం)
6. ఏలూరు (ముఖ్య కేంద్రం ఏలూరు)
7. ఎన్టీఆర్‌ (ముఖ్య కేంద్రం విజయవాడ)
8. బాపట్ల (ముఖ్య కేంద్రం బాపట్ల)
9. పల్నాడు (ముఖ్య కేంద్రం నరసరావుపేట)
10. నంద్యాల (ముఖ్య కేంద్రం నంద్యాల)
11. శ్రీ సత్యసాయి (ముఖ్య కేంద్రం పుట్టపర్తి)
12. అన్నమయ్య (ముఖ్య కేంద్రం రాయచోటి)
13. శ్రీ బాలాజీ(ముఖ్య కేంద్రం తిరుపతి)

పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని సీఎం జగన్‌ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయం తెలిసిందే.