Telangana Covid Update List : తెలంగాణలో కరోనా కలకలం.. మరోసారి 100కు పైనే.. అత్యధికంగా హైదరాబాద్‌లో

తెలంగాణలో ఇప్పటిదాకా 7లక్షల 94వేల 329 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7లక్షల 89వేల 241 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 977 యాక్టివ్ కేసులు ఉన్నాయి.(Telangana Covid Update List)

Telangana Covid Update List : తెలంగాణలో మరోసారి కరోనావైరస్ మహమ్మారి కలకలం రేగింది. కొవిడ్ వ్యాప్తి ఊపందుకుంటోంది. మళ్లీ 100కు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 15వేల 200 కరోనా పరీక్షలు నిర్వహించగా 145 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒక్క హైదరాబాద్ లోనే 117 కొత్త కేసులు నమోదయ్యాయి.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 75 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 7లక్షల 94వేల 329 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7లక్షల 89వేల 241 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 977 యాక్టివ్ కేసులు ఉన్నాయి.(Telangana Covid Update List)

రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 16వేల 319 కరోనా టెస్టులు చేయగా 155 మందికి పాజిటివ్ గా తేలింది. రాష్ట్రంలో క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది.

Covid-19 : దేశంలో కోవిడ్ ఫోర్త్ వేవ్-కొట్టి పారేసిన ఐసీఎంఆర్

అటు దేశంలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా కొత్త కేసులు 8 వేలకు పైగా నమోదయ్యాయి. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, కర్నాటక, హరియానాలో మహమ్మారి విజృంభిస్తోంది. దాంతో యాక్టివ్ కేసులు 40 వేల మార్కును దాటేశాయి.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

శుక్రవారం 3.44 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 8వేల 329 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. 103 రోజుల తర్వాత ఈ స్థాయి వ్యాప్తి కనిపించింది. పాజిటివిటీ రేటు వరుసగా మూడోరోజు రెండు శాతం(2.41 శాతం) పైనే నమోదైంది. మహారాష్ట్రలో 3,081 మందికి కరోనా సోకగా.. ఒక్క ముంబైలోనే ఆ సంఖ్య 1,956గా ఉంది. దాంతో ఆ నగరంలో పాజిటివిటీ రేటు 12.74 శాతానికి చేరి, ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కేరళలో 2,415.. ఢిల్లీలో 655 మంది వైరస్ బారినపడ్డారు. 2020 ప్రారంభం నుంచి 4.32 కోట్లకు పైగా కొవిడ్ కేసులొచ్చాయి.(Telangana Covid Update List)

Heart Gel : ఒక్క జెల్‌తో గుండె సమస్యలకు పరిష్కారం..UK పరిశోధకుల ఘనత

తాజా విజృంభణతో బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం వైరస్‌తో బాధపడుతున్న వారి సంఖ్య (యాక్టివ్ కేసులు) 40వేల 370కి చేరింది. మొత్తం కేసుల్లో ఆ వాటా 0.09 శాతంగా నమోదైంది.(Telangana Covid Update List)

Covid Test: అమెరికా వచ్చే వాళ్లకు కోవిడ్ టెస్ట్ నిబంధన ఎత్తివేత

24 గంటల వ్యవధిలో మరో 4వేల 216 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 98.69 శాతానికి పడిపోయింది. ఒక్కరోజు వ్యవధిలో మరో 10 మంది కొవిడ్ తో మరణించారు. నిన్న 15.08 లక్షల మంది టీకా తీసుకోగా.. ఇప్పటివరకూ 194.9 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

ట్రెండింగ్ వార్తలు