Covid Test: అమెరికా వచ్చే వాళ్లకు కోవిడ్ టెస్ట్ నిబంధన ఎత్తివేత

ఇకపై అమెరికా వచ్చే విదేశీ ప్రయాణికులు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు అమలులో ఉన్న ఈ నిబంధనను ఎత్తివేస్తూ బైడెన్ సర్కారు తాజాగా నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని అమెరికా ప్రకటించింది.

Covid Test: అమెరికా వచ్చే వాళ్లకు కోవిడ్ టెస్ట్ నిబంధన ఎత్తివేత

Covid Test

Covid Test: ఇకపై అమెరికా వచ్చే విదేశీ ప్రయాణికులు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు అమలులో ఉన్న ఈ నిబంధనను ఎత్తివేస్తూ బైడెన్ సర్కారు తాజాగా నిర్ణయం తీసుకుంది. శనివారం అర్ధరాత్రి 12:01 గంటల నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని అమెరికా ప్రకటించింది. రెండేళ్ల క్రితం కోవిడ్ మొదలైనప్పటి నుంచి అమెరికాకు వచ్చే ప్రయాణికులు ఒక రోజు ముందుగా కోవిడ్ టెస్ట్ చేసుకోవాలనే నిబంధన ఇప్పటివరకు అమలులో ఉంది. టెస్టు తర్వాత దీనికి సంబంధించిన పత్రాలను చూపించాల్సి ఉంటుంది. రిజల్ట్ నెగెటివ్ వచ్చిన వాళ్లకు మాత్రమే అమెరికాలోకి అనుమతి ఉంటుంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ టెస్టులు అవసరం లేదని భావిస్తున్నట్లు అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకటించింది.

carrots- : శరీరంలోని కలుషితాలు ఖతం చేసే క్యారెట్లు..

తాజాగా ఈ అంశంపై సైన్స్ అండ్ డాటాను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు బైడెన్ సర్కారు వెల్లడించింది. అయితే, విమానయాన సంస్థలు, ట్రావెల్ ఇండస్ట్రీ ఒత్తిడి వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇది సమ్మర్ సీజన్ కావడంతో ప్రయాణికులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కఠిన నిబంధనలు సరికావని, దీనివల్ల ఇండస్ట్రీకి ఇబ్బంది అని సంస్థలు భావించాయి. దీంతో కోవిడ్ పరీక్ష చేయించుకోవాలనే నిబంధన ఎత్తివేసేలా చేశాయి. మరోవైపు వచ్చే 90 రోజుల్లో ఈ నిర్ణయంపై సమీక్ష జరిపి, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మళ్లీ నిర్ణయం తీసుకుంటామని సీడీసీ ప్రకటించింది.