Heart Gel : ఒక్క జెల్‌తో గుండె సమస్యలకు పరిష్కారం..UK పరిశోధకుల ఘనత

గుండెపోటుతో బాధపడేవారికి గుడ్‌న్యూస్‌ చెప్పారు యూకే శాస్త్రవేత్తలు.గుండె సమస్యలకు ఒక్క జెల్‌తో పరిష్కారం మార్గాన్ని కనిపెట్టారు. దీంతో గుండెపోటు తర్వాత పరిణామాలకు ఇక చెక్‌ పడినట్లే.

Heart Gel : ఒక్క జెల్‌తో గుండె సమస్యలకు పరిష్కారం..UK పరిశోధకుల ఘనత

Special Heart Gel (1)

Special Heart Gel : ఒక్కసారి గుండెపోటు పలకరిస్తే.. ఆ ప్రమాదం జీవితాంతం వెంటాడుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతకాలి. హార్ట్ స్ట్రోక్ తర్వాత.. గుండె చుట్టూ జరిగే డ్యామేజ్‌ జరుగుతుంది. దీంతో గుండెకు ఎప్పుడైనా మళ్లీ ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితిని దాటేందుకు వాల్డ్‌వైడ్‌గా సైంటిస్టులు చాలా ప్రయోగాలు చేస్తున్నారు. ఐతే ఎట్టకేలకు ఇంగ్లండ్ సైంటిస్టులు ఇప్పుడు గుడ్‌న్యూస్‌ చెప్పారు. వారు కనిపెట్టిన ఒక్క జెల్.. ఇప్పుడు అన్ని సమస్యలకు చెక్‌ పెట్టేలా కనిపిస్తోంది.

గుండెపోటుతో బాధపడేవారికి గుడ్‌న్యూస్‌ చెప్పారు యూకే శాస్త్రవేత్తలు.గుండె సమస్యలకు ఒక్క జెల్‌తో పరిష్కారం మార్గాన్ని కనిపెట్టారు. దీంతో గుండెపోటు తర్వాత పరిణామాలకు ఇక చెక్‌ పడినట్లే. అప్పటివరకు కొట్టుకుంటున్న గుండె.. ఉన్నట్లుండి ఆగిపోతుంది. ఆ మనిషిని మరణం వైపు.. ఓ కుటుంబాన్ని శోకం వైపు తోసేస్తోంది. అప్పటికప్పుడు అప్రమత్తమై.. ఆ సమయానికి సమస్య దాటినా.. గుండెపోటు తర్వాత పరిణామామాలు జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయ్. ఏం జరిగిందో.. నిజమైన కారణం ఏంటో కానీ.. కరోనా తర్వాత గుండెపోట్లు మరింత పెరిగాయ్. కోవిడ్ మహమ్మారి గుండె మీద గునపాలు గుచ్చుతోంది. వయసుతో సంబంధం లేకుండా.. ప్రతీ ఒక్కరిని గుండెపోటు పలకరిస్తోంది. దీంతో ఛాతిలో చిన్న నొప్పి వచ్చినా.. భయంతో వణికిపోతున్న పరిస్థితి. మాములుగా గుండెపై రక్తనాళాలు దెబ్బతినడంతో స్ట్రోక్‌ వస్తుంది. మొదటిసారి ఎలాగోలా ప్రాణాలు దక్కించుకున్నా.. ప్రమాదం ఎప్పుడూ వెంటాడే ఉంటుంది. ఆ రక్తనాళాలను ఉత్పత్తి అయ్యేలా చేసి.. కణజాలం నిర్మిస్తే.. సమస్య నుంచి గట్టెక్కినట్లే ! దీనికోసం ఎప్పటినుంచో ప్రయోగాలు జరుగుతున్నాయ్. ఇన్నాళ్లకు ఇంగ్లండ్‌ సైంటిస్టులు ఈ సమస్యకు పరిష్కారాన్ని కనిపెట్టారు. వైద్యరంగంలోకి అది ఇప్పుడు హాట్‌టాపిక్‌ అవుతోంది.

ఒక్కసారి గుండెపోటు వస్తే.. హార్ట్‌లో ఉండే చాలా కణాలు డ్యామేజ్ అవుతుంటాయ్. వాటిని తిరిగి ఉత్పత్తి చేయగలిగితే.. చాలా వరకు ప్రమాదాన్ని దాటినట్లే ! దీనికోసం ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయ్. గుండెలో కొత్త కణాలు ఉత్పత్తి చేసేందుకు.. రకరకాల ప్రయోగాలు చేశారు. ఐతే ఇప్పుడా పరిశోధనలు ఫలించాయ్. కొత్త హృదయనాళ చికిత్సకు దారి తీసే.. బయో డీగ్రేడబుల్ జెల్‌ను యూనివర్సిటీ ఆఫ్‌ మాంచెస్టర్‌ సైంటిస్టులు కనిపెట్టారు. గుండె కణజాలాలను ఉత్పత్తి చేయడంలో వారు సక్సెస్ అయ్యారు. సాధారణ గుండె కండరాల కణజాల పెరుగుదలకు జెల్ ఉపయోగపడుతుందని.. తోడ్పాటు చేస్తుందని ప్రూవ్ చేశారు. ఈ ప్రయోగం ఇప్పుడు మెడికల్ రంగంలోనే మిరాకిల్‌గా మారింది.

ప్రపంచం అంతా గుండె సంబంధింత వ్యాధుల భారాన్ని మోస్తోంది. ఇలాంటి సమయంలో UK సైంటిస్టులు సాధించిన ఈ ఘనత.. మేజర్ బ్రేక్‌ త్రూ కావడం ఖాయం. నిజానికి గుండెపోటు తర్వాత పరిణామాలు, ఎదురయ్యే ప్రమాదాలకు చెక్‌ పెట్టేందుకు సైంటిస్టులు ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో గుండెలోకి నేరుగా కణాలను ఇంజెక్ట్ చేసేవారు. ఐతే అవి ఒక శాతం మాత్రమే సమర్థంగా పనిచేస్తూ.. కొత్త కణజాలం పెరగడానికి ఉపయోగపడేవి. దీంతో పెద్దగా ప్రభావం లేకపోవడంతో.. ప్రయోగాలు మరింత ముమ్మరం చేశారు. యూనివర్సిటీ ఆఫ్‌ మాంచెస్టర్‌ సైంటిస్టులు ఇప్పుడు కనిపెట్టిన జెల్‌ను.. నేరుగా గుండెలోకి ఇంజెక్ట్ చేయగా.. అది సమర్థవంతంగా పనిచేయడం ప్రారంభించింది. హృదయాంతరాళంలో కొత్త కణజాలాలను ఉత్పత్తి చేస్తూ.. హార్ట్ ఎటాక్ తర్వాత జరిగే డ్యామేజ్‌ను కంట్రోల్‌ చేయడంలో మంచి ఫలితాలు చూపించింది.

ఈ జెల్‌ ప్రొటీన్లు అనేవి.. పెప్టైడ్స్ అనే అమైనో ఆమ్లాల చైన్‌తో తయారుచేశారు. పెప్టైడ్ల మధ్య బంధాలతో జెల్‌గా రూపొందించారు. దీన్ని గుండెలోకి నేరుగా ఇంజెక్ట్ చేస్తారు. ఐతే హార్ట్‌పై ఒత్తిడి పెరిగినప్పుడు.. ఈ పెప్టైడ్‌ చైన్‌ జెల్‌గా మారుతుంది. ఇంజెక్షన్‌కు అనుకూలంగా ప్రవర్తిస్తుంది. మాంచెస్టర్‌లో జరిగిన బ్రిటీష్‌ కార్డియోవాస్కులర్ సొసైటీ కాన్ఫరెన్స్‌లో ఈ అధ్యయనం ప్రదర్శించారు. గుండెకు ఎలాంటి నష్టం జరిగినా.. సరిచేసే పరిస్థితులు చాలా పరిమితంగా ఉంటాయని.. ఐతే ఈ పరిశోధనతో వాటిని అధిగమించేందుకు మార్గాలను అన్వేషించే అవకాశం ఉంటుంది సైంటిస్టులు చెప్తున్నారు. గుండెపోటు తర్వాత విఫలం అయ్యే కణజాలాలను రిపేర్ చేయడంలో.. జెల్‌ సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు.

సెల్ ఆధారిత చికిత్సలకు.. తాము కనిపెట్టిన జెల్‌ సమర్ధవంతమైన ఎంపిక అని.. మాంచెస్టర్ యూనివర్సిటీ సైంటిస్టులు అంటున్నారు. గుండెలో కొత్త కణజాలం ఉత్పత్తి కావడానికి.. మంచి రక్తప్రసరణ చాలా ముఖ్యం. మాములుగా స్ట్రోక్‌ వస్తే.. గుండెను ఆనుకొని ఉండే అతి చిన్న రక్తనాళాలు డ్యామేజ్ అవుతాయ్. ఐతే ప్రస్తుతం ఇంజెక్ట్ చేసిన జెల్‌లో రక్తనాళాల పెరుగుదల సైంటిస్టులు గమనించారు. దీనిద్వారా కణజాలం పెరిగి.. మూడువారాల తర్వాత అవి కొట్టుకోవడాన్ని పరిశోధకులు గుర్తించారు. మాంచెస్టర్‌ సైంటిస్టుల ప్రయోగం ఇప్పుడు మెడికల్ చరిత్రలో కొత్త అధ్యాయానికి తెర తీసినట్లు అయింది. ఇది సక్సెస్ అయి.. అందుబాటులోకి వస్తే.. ప్రపంచం అంతా ఎదుర్కొంటున్న ఓ సమస్యకు భారీ పరిష్కారం లభించినట్లే !