Covid-19 : దేశంలో కోవిడ్ ఫోర్త్ వేవ్-కొట్టి పారేసిన ఐసీఎంఆర్

దేశంలో కోవిడ్ ఫోర్త్ వేవ్ వస్తోందనే వార్తలు అవాస్తవమని ఐసీఎంఆర్ ఏడీజీ (అడ్మినిస్ట్రేటివ్‌ సెటప్‌ డైరెక్టర్‌) సమీరన్ పాండా అన్నారు.

Covid-19 : దేశంలో కోవిడ్ ఫోర్త్ వేవ్-కొట్టి పారేసిన ఐసీఎంఆర్

Samiran Panda

Covid-19 : దేశంలో కోవిడ్ ఫోర్త్ వేవ్ వస్తోందనే వార్తలు అవాస్తవమని ఐసీఎంఆర్ ఏడీజీ (అడ్మినిస్ట్రేటివ్‌ సెటప్‌ డైరెక్టర్‌) సమీరన్ పాండా అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొన్ని జిల్లాలలో కేసులు పెరుగుతూ ఉండటాన్ని దేశవ్యాప్తంగా పరిగణలోకి తీసుకోలేమని చెప్పారు. దేశంలో కనిపించే రూపాంతరం చెందిన ప్రతి వైరస్ ఆందోళన కలిగించేది కాదని కూడా ఆయన స్పష్టం చేశారు.

కోవిడ్ ఫోర్త్  వేవ్ భారత్ లో వచ్చే అవకాశం లేదని మాక్స్ హెల్త్‌కేర్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ రోమెల్ టిక్కూ వ్యాఖ్యానించారు. దేశంలో కోవిడ్ కేసులు నమోదవుతున్నప్పటికీ  మునుపటి లాగా ప్రమాదకరంగా మారే పరిస్ధితి లేదని ఆయన అన్నారు.  కొత్త వేరియంట్ వల్ల ప్రమాదమేమీ లేదని ఆయన చెప్పారు.  మరోవైపు దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో కోరారు. రోజు వారీ కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని, జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం కొత్త వేరియంట్ లక్షణాలు సోకిన వ్యక్తుల నమూనాలను పంపాలని కేరళ, తమిళనాడు,కర్ణాటక,తెలంగాణ, మహారాష్ట్రలను కోరారు.

Also Read : Pink Lake: గుజరాత్‌లో పింక్ లేక్.. అద్భుతం అంటున్న స్థానికులు