Pink Lake: గుజరాత్‌లో పింక్ లేక్.. అద్భుతం అంటున్న స్థానికులు

ఇప్పటిదాకా విదేశాల్లోనే కనిపించిన ‘పింక్ లేక్’ ఇప్పుడు మన దేశంలోనూ పుట్టుకొచ్చింది. గుజరాత్‌లోని బనాస్ కాంతా జిల్లాలో ఉన్న సుగమ్ గ్రామంలోని చెరువు పింక్ కలర్‌లోకి మారిపోయింది. కొరేటి అనే పేరు గల ఈ చెరువు భారత్-పాకిస్తాన్ సరిహద్దులో ఉంది.

Pink Lake: గుజరాత్‌లో పింక్ లేక్.. అద్భుతం అంటున్న స్థానికులు

Pink Lake

Pink Lake: ‘పింక్ లేక్స్’ గురించి వినే ఉంటారు. ఆస్ట్రేలియా, స్పెయిన్ లాంటి దేశాల్లో పింక్ లేక్స్ చాలా ఫేమస్. వాతావరణ మార్పులు, బ్యాక్టీరియా, ఆల్గే వంటి కారణాలతో నీళ్లు గులాబి రంగులోకి మారుతుంటాయి. ఇలా చాలా దేశాల్లో ‘పింక్ లేక్స్’ ఉన్నాయి. అలాంటివాటిలో ఆస్ట్రేలియాలో ఉన్న పింక్ లేక్ చాలా ఫేమస్. ఈ సరస్సును చూసేందుకు చాలా మంది విదేశీ టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు. ఇప్పటిదాకా విదేశాల్లోనే కనిపించిన ‘పింక్ లేక్’ ఇప్పుడు మన దేశంలోనూ పుట్టుకొచ్చింది. గుజరాత్‌లోని బనాస్ కాంతా జిల్లాలో ఉన్న సుగమ్ గ్రామంలోని చెరువు పింక్ కలర్‌లోకి మారిపోయింది. కొరేటి అనే పేరు గల ఈ చెరువు భారత్-పాకిస్తాన్ సరిహద్దులో ఉంది. ఉన్నట్లుండి ఈ చెరువులోని నీళ్లు గులాబి రంగులోకి మారిపోవడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని అద్భుతంగా వర్ణిస్తున్నారు.

Jubilee Hills Rape Case: పోలీసు కస్టడీలో నేడు నిందితుల విచారణ

ఇది వర్షపు నీటి ఆధారిత చెరువు. వర్షాకాలంలో చెరువు నిండుతుంది. ఆ తర్వాత ఈ నీటినే గ్రామస్తులు తమ అవసరాలకు వాడుకుంటారు. ప్రస్తుతం నీళ్లు గులాబి రంగులోకి మారడంతో ఈ వింతను చూసేందుకు స్థానికులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. అధికారులు ఇక్కడికి చేరుకుని చెరువు నీటిని పరిశీలించారు. నీటి శాంపిల్స్ సేకరించి ప్రయోగశాలకు పంపారు. నీటిని పరీక్ష కోసం పంపామని, ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని తహసీల్దార్ తెలిపారు. ఈ నీటి గురించిన పూర్తి సమాచారం తెలిసేవరకు ఎవరూ నీటిని, ఎలాంటి అవసరాలకు వినియోగించవద్దని అధికారులు ప్రజలకు సూచించారు.