Telangana Covid Bulletin News : తెలంగాణలో కొత్తగా 30 మందికి కరోనా

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 16వేల 267 కరోనా పరీక్షలు నిర్వహించగా, 30 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.(Telangana Covid Bulletin News)

Telangana Covid Bulletin News : తెలంగాణలో కొత్తగా 30 మందికి కరోనా

Telangana Covid Report

Updated On : April 5, 2022 / 9:21 PM IST

Telangana Covid Bulletin News : తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. క్రితం రోజుతో(17) పోలిస్తే కొత్త కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 16వేల 267 కరోనా పరీక్షలు నిర్వహించగా, 30 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 17 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మరో 41 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు.

తెలంగాణలో ఇప్పటివరకు 7,91,375 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,87,004 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 260 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో 4వేల 111 మంది మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 15వేల 675 కరోనా పరీక్షలు నిర్వహించగా, 17 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(Telangana Covid Bulletin News)

XE recombinants virus : కరోనా కొత్త వైరస్ ‘XE Omicron’ లక్షణాలివే..!

అటు దేశంలోనూ కరోనావైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు, మరణాలు గణనీయంగా తగ్గాయి. క్రితంరోజు వెయ్యి లోపే నమోదైన కొత్త కేసులు.. తాజాగా 800 దిగువకు చేరాయి. 50కి పైగా మరణాలు సంభవించాయి.

సోమవారం 4 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 795 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పాజిటివిటీ రేటు 0.17 శాతానికి చేరుకుంది. కేరళ మునుపటి గణాంకాలను సవరించడంతో మృతుల సంఖ్యలో పెరుగుదల కనిపించింది. 24 గంటల వ్యవధిలో 58 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. అందులో కేరళ వాటానే 56.

ఇక నిన్న మరో 1,280 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. కరోనా యాక్టివ్ కేసులు మరింత తగ్గి.. 12వేలకు దిగొచ్చాయి. 2020 ఏడాది ప్రారంభం నుంచి నేటివరకు దేశంలో 4.30 కోట్ల కరోనా కేసులు నమోదవగా.. అందులో రికవరీ రేటు 98.76 శాతానికి చేరి ఊరటనిస్తోంది. యాక్టివ్ కేసుల రేటు 0.03 శాతానికి క్షీణించింది. మరణాలు 1.21 శాతంగా ఉన్నాయి. ఇక కరోనా కట్టడి కోసం ప్రారంభించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న 16 లక్షలమంది టీకా తీసుకోగా.. 184 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.(Telangana Covid Bulletin News)

చైనాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా అతిపెద్ద నగరం, వాణిజ్య రాజధాని అయిన షాంఘైలో వైరస్‌ వ్యాప్తి విపరీతంగా ఉంది. దేశంలో మొత్తంగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు 70 శాతం ఈ ఒక్క నగరంలోనే బయటపడుతున్నాయి. దీంతో అప్రమత్తమైన చైనా ప్రభుత్వం.. షాంఘైలో వైరస్‌ వ్యాప్తి కట్టడికి చర్యలు చేపట్టింది. పరీక్షలను పెంచడంతో పాటు పెద్ద ఎత్తున ఆరోగ్య కార్యకర్తలు, సైన్యాన్ని నగరానికి పంపింది.

China Covid : చైనాలో కరోనా విలయతాండవం.. కొత్తగా 16వేలకు పైగా కేసులు, ఇదే అత్యధికం..!

చైనాలో కొన్ని రోజులుగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. సోమవారం దేశవ్యాప్తంగా 13వేలకు పైగా కొత్త కేసులు నమోదవ్వగా.. ఇందులో దాదాపు 9వేల కేసులు ఒక్క షాంఘైలోనే ఉండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నగరంలో వైరస్‌ ఉధృతి ఎక్కువగా ఉండటంతో గతవారం లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. నగర వ్యాప్తంగా దాదాపు అన్ని కార్యకలాపాలను నిలిపివేసి, కఠినమైన లాక్‌డౌన్‌ విధించి.. ప్రజలను ఇళ్లకే పరిమితం చేసినప్పటికీ షాంఘైలో కేసులు పెరుగుతున్నాయి. దీంతో అధికారులు ట్విన్‌ కొవిడ్‌ పరీక్షలు మొదలుపెట్టారు. అంటే నగరంలో ప్రతి పౌరుడికి యాంటీజెన్, న్యూక్లిక్‌ యాసిడ్‌ పరీక్షలు చేస్తున్నారు.