Telangana Corona Update : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..

రాష్ట్రంలో ఇంకా 296 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటివరకు రాష్ట్రంలో కొవిడ్ తో మరణించిన..(Telangana Corona Update)

Telangana Covid Report

Telangana Corona Update : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 14వేల 662 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 40 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 21 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 20 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.

రాష్ట్రంలో ఇంకా 296 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటివరకు రాష్ట్రంలో కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4వేల 111. నేటివరకు రాష్ట్రంలో 7,91,946 కరోనా కేసులు నమోదవగా.. 7,87,539 మంది కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 14వేల 752 కరోనా పరీక్షలు నిర్వహించగా, 49 మందికి పాజిటివ్ గా తేలింది.

దేశంలో మరోసారి కరోనావైరస్ మహమ్మారి కలకలం రేగింది. తగ్గినట్టే తగ్గిన కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది.(Telangana Corona Update)

India Covid-19 : 46 రోజుల తర్వాత.. దేశంలో 3వేల మార్క్ దాటిన కరోనా కేసులు!

దేశంలో కరోనా వ్యాప్తి కంటిన్యూ అవుతోంది. రోజురోజుకూ కొత్త కేసులు స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా మూడు వేల మందికి వైరస్ సోకింది. దేశ రాజధాని ఢిల్లీ కరోనా వ్యాప్తి టెన్షన్ పెడుతోంది. ఒక్క ఢిల్లీలోనే 1300 పైగా కేసులొచ్చాయి.

బుధవారం దాదాపు ఐదు లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 3వేల 303 మందికి పాజిటివ్‌గా తేలింది. పాజిటివిటీ రేటు 0.6 శాతానికి పెరిగింది. ఢిల్లీలో 1,367 మందికి వైరస్ సోకింది. కేరళ, ఉత్తరప్రదేశ్, హరియానా, మిజోరం వంటి రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. దాంతో ఆయా
రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించాలని హెచ్చరిస్తున్నాయి. కొత్త వేవ్ మహారాష్ట్రలోకి ప్రవేశించకుండా ఉండాలంటే రాష్ట్ర వాసులంతా మాస్కులు ధరించాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రే కోరారు.

ఇక 24 గంటల వ్యవధిలో మరో 2వేల 563 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. కొద్ది రోజులుగా యాక్టివ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ కేసుల సంఖ్య 16,980 (0.04 శాతం)కి చేరింది. రికవరీ రేటు 98.74 శాతానికి తగ్గింది. నిన్న మరో 39 మంది కొవిడ్ తో మరణించారు. వాటిలో ఒక్క కేరళలోనే 36 మరణాలు చోటు చేసుకున్నాయి. ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. నిన్న 19.5 లక్షల మంది టీకా తీసుకోగా.. ఇప్పటి
వరకూ 188 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

China : చైనాలో మరో వైరస్‌..ప్రపంచంలోనే మొదటి కేసు నమోదు..చికిత్స పొందుతున్న 4 ఏళ్ల బాలుడు

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టే వ్యాక్సినేషన్‌ను మరింత విస్తరించేందుకు కేంద్రం చర్యలు వేగవంతం చేసింది. 5 నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలకు టీకా పంపిణీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిపై నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్
ఇమ్యూనైజేషన్‌ (ఎన్‌టీఏజీఐ) నిర్ణయం వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. నిపుణుల కమిటీ ఇచ్చే సిఫార్సుల ఆధారంగా 5-12 ఏళ్ల వారికి టీకా పంపిణీపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు.