Telangana Covid : తెలంగాణలో కొత్తగా 91 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 24వేల 444 కరోనా పరీక్షలు (Telangana Covid)

Telangana Covid : తెలంగాణలో కొత్తగా 91 కరోనా కేసులు

Telangana Corona Cases

Telangana Covid : తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 24వేల 444 కరోనా పరీక్షలు నిర్వహించగా 91 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ లో 33 కొత్త కేసులు నమోదవగా, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 184 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు.(Telangana Covid)

రాష్ట్రంలో ఇప్పటివరకు 7,90,134 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,84,800 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,223 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటిదాకా కరోనాతో 4వేల 111 మంది మరణించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు 92 కరోనా కేసులు నమోదయ్యాయి.(Telangana Covid)

అటు దేశంలోనూ కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు గణనీయంగా తగ్గాయి. దాదాపు రెండేళ్ల కనిష్ఠానికి మహమ్మారి వ్యాప్తి క్షీణించింది. కొన్ని రోజులుగా 5 వేల దిగువనే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 8 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 4వేల 184 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల వ్యవధిలో మరో 104 మంది కోవిడ్ తో మరణించారు. మొత్తంగా 4.29 కోట్ల మందికి కరోనా సోకగా.. 5.15 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.(Telangana Covid)

TS Covid Update : తెలంగాణలో కొత్తగా 92 కోవిడ్ కేసులు

వైరస్ వ్యాప్తి అదుపులో ఉండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 44,488కి పడిపోయింది. దాంతో యాక్టివ్ కేసుల రేటు 0.1 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 98.70 శాతానికి పెరిగింది. నిన్న మరో 6,554 మంది కోలుకోగా.. మొత్తం రికవరీలు 4.24 కోట్లు దాటాయి. ఇప్పటివరకూ 179.5 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న 18 లక్షల మందికి పైగా టీకా తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.(Telangana Covid)

దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రభావం తగ్గింది. కేసులు దిగివచ్చాయి. ఇక కరోనా మహమ్మారి పీడ వదిలినట్టే అని జనాలు రిలాక్స్ అవుతున్నారు. ఇంతలోనే కాన్పూర్‌ ఐఐటీకి చెందిన పరిశోధకులు బాంబు పేల్చారు. వచ్చే జూన్‌లో భారత్‌లో కొవిడ్‌ ఫోర్త్ వేవ్‌ మొదలయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. జూన్‌ 22 నుంచి అక్టోబర్‌ 24 వరకు ఫోర్త్‌ వేవ్‌ ప్రభావం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఈ దశ తీవ్రత ఎలా ఉండనుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. కొత్త వేరియంట్లు, మ్యుటేషన్లు, వ్యాక్సిన్లు, బూస్టర్‌ డోసుల ప్రభావం ఆధారంగా నాలుగో దశ తీవ్రత ఆధారపడి ఉంటుందన్నారు.

Covid-19 Fourth Wave: జూన్ లో కరోనా నాలుగో వేవ్ ఉంటుందన్న ఐఐటీ కాన్పూర్ అధ్యయనం

దశల వారీగా రూపాంతరం చెందుతున్న మహమ్మారి.. కొత్త వేరియంట్ల రూపంలో ప్రజలపై పడగవిప్పుతూనే ఉంది. గత మూడేళ్లుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన మహమ్మారి.. జనాలకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ఈ క్రమంలో ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు చేపట్టిన అధ్యయనం మరోసారి కరోనా వ్యాప్తిపై ఆందోళన కలిగిస్తుంది. కరోనా మొదలైన నాటి నుంచి కాలానుగుణంగా అది చూపుతున్న ప్రభావాన్ని అంచనా వేసి.. పలు విషయాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట పరిశోధకులు ఈ నిర్ణయానికి వచ్చారు.