Telangana : నన్ను చంపటానికి రేవంత్ రెడ్డి కుట్ర..నాపై దాడి చేసినవారిని..చేయించినవారిని వదిలేదు లేదు.. : మంత్రి మల్లారెడ్డి

నన్ను చంపటానికి తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి యత్నిస్తున్నారంటూ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై దాడి వెనక రేవంత్‌రెడ్డి కుట్ర ఉందని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. నాపై దాడి చేయటానికి రెడ్డి సభ మంచి అవకాశంగా రేవంత్ రెడ్డి భావించి పక్కా ప్లాన్ ప్రకారమే తనపై రెడ్డి సభకు గూండాలను పంపించి దాడి చేయించారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి మల్లారెడ్డి.

Rewanth Reddy VS Malla Reddy : నన్ను చంపటానికి తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి యత్నిస్తున్నారంటూ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై దాడి వెనక రేవంత్‌రెడ్డి కుట్ర ఉందని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. నాపై దాడి చేయటానికి రెడ్డి సభ మంచి అవకాశంగా రేవంత్ రెడ్డి భావించి పక్కా ప్లాన్ ప్రకారమే తనపై రెడ్డి సభకు గూండాలను పంపించి దాడి చేయించారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి మల్లారెడ్డి. రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నిస్తున్నానన్న దుగ్ధతోనే అనుచరుల ద్వారా దాడిచేయించాడని..నాపై దాడి చేసినవారిని ఎట్టి పరిస్థితుల్లోను విడిచిపెట్టనని దాడికి కుట్ర చేసిన రేవంత్ రెడ్డిని జైలుకు పంపించి తీరుతాను అంటూ మల్లారెడ్డి శపథం చేశారు.

Also read : Attack On Mallareddy Convoy : రెడ్ల సభలో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ.. ఆ మాట అనడంతో రాళ్ల దాడి
తాను ఇటువంటి దాడులకు భయపడే రకం కాదన్నారు. రెడ్డి కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో టీఆర్ఎస్ హామీ ఇచ్చిందని..కరోనా కారణంగా కొంత ఆలస్యమైందని వివరించారు. ఇదే విషయాన్ని తాను సభలో చెబుతుండగా తనకు వ్యతిరేకంగా నినాదాలు చేసి దాడి చేశారని మంత్రి మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ శివారులో ఆదివారం (మే 29,2022)సాయంత్రం నిర్వహించిన రెడ్ల సింహగర్జన మహాసభలో మంత్రి మల్లారెడ్డి ప్రసంగిస్తుండగా కొందరు కార్యకర్తలు అడ్డుకున్నారు.

దీంతో మంత్రి తన ప్రసంగాన్ని నిలిపివేశారు. అయినప్పటికీ నిరసనకారులు రెచ్చిపోవడంతో..ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన నిరసనకారులు మల్లారెడ్డి కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. చేతికందిన కుర్చీలు, మంచినీళ్ల సీసాలు కాన్వాయ్ పై విసురుతూ దాడిచేశారు. పోలీసులు వలయంగా ఏర్పడి మంత్రిని అక్కడి నుంచి తరలించారు.

 

ట్రెండింగ్ వార్తలు