Attack On Mallareddy Convoy : రెడ్ల సభలో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ.. ఆ మాట అనడంతో రాళ్ల దాడి

రెడ్ల సభలో మంత్రి మల్లారెడ్డికి ఊహించని రీతిలో నిరసన సెగ ఎదురైంది. ఆయన రెడ్ల ఆగ్రహానికి గురయ్యారు. పరుగులు పెట్టి మరీ దాడికి ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది.(Attack On Mallareddy Convoy)

Attack On Mallareddy Convoy : రెడ్ల సభలో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ.. ఆ మాట అనడంతో రాళ్ల దాడి

Attack On Mallareddy Convoy

Attack On Mallareddy Convoy : తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి ఊహించని రీతిలో నిరసన సెగ ఎదురైంది. ఆయన రెడ్ల ఆగ్రహానికి గురయ్యారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ లో ఆదివారం సాయంత్రం రెడ్డి సింహగర్జన బహిరంగ సభ జరిగింది. రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు లక్ష్యంగా నిర్వహించిన ఈ సభలో రెడ్ల జేఏసీ నేతలతో పాటు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి అతిథిగా వచ్చారు. ఆయన ప్రసంగిస్తుండగా, రెడ్డి శ్రేణులకు చెందిన కొందరు వ్యక్తులు నినాదాలు చేస్తూ మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. వారు ఏమాత్రం శాంతించకపోవడంతో మంత్రి మల్లారెడ్డి తన ప్రసంగాన్ని ఆపేశారు.

అయినప్పటికీ సభకు వచ్చిన వారిలో కొందరు రెచ్చిపోవడంతో, ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన సభికులు.. మల్లారెడ్డి కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. చేతికందిన కుర్చీలు, మంచినీళ్ల సీసాలు కాన్వాయ్ పై విసిరారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వలయంగా ఏర్పడి మంత్రిని అక్కడి నుంచి తరలించారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. రూ.5 వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.(Attack On Mallareddy Convoy)

మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారుడితోపాటు మరో ఐదుగురు అనుచరులపై భూకబ్జా కేసు

మంత్రి ప్రసంగాన్ని మధ్యలో ఆపేసి తన కాన్వాయ్ లో వెళ్లిపోతుండగా.. కొందరు కాన్వాయ్‌ వెంట పరుగులు తీశారు. మంత్రి కారుపై కుర్చీలు, రాళ్లు, చెప్పులు విసిరారు. కాన్వాయ్‌ వెంట పరుగులు పెట్టి మరీ దాడికి ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది.

మల్లారెడ్డి సభకు వచ్చినప్పుడు వాతావరణం అంతా ప్రశాంతంగానే ఉంది. అయితే, ఎప్పుడైతే మంత్రి సభా వేదికపైకి ఎక్కి మైకు పట్టుకుని స్పీచ్‌ అందుకున్నారో.. అంతే.. ఆగ్రహజ్వాలలు ఎగిసిపడ్డాయి. కార్యక్రమానికి వచ్చిన వాళ్లంతా మంత్రి తమ సామాజికవర్గానికి సంబంధించిన మాటలు మాట్లాడతారని ఎదురుచూశారు. కానీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి మంత్రి వివరించారు. రాష్ట్రంలో అభివృద్ధి టీఆర్‌ఎస్‌ పాలనలోనే జరిగిందని.. మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని చెప్పారు. అంతే ఆ ఒక్కమాటతో కార్యక్రమానికి వచ్చిన వాళ్లు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పదే పదే కేసీఆర్, టీఆర్‌ఎస్ గొప్పల గురించే మాట్లాడుతున్నారని మంత్రి ప్రసంగానికి రెడ్లు అడ్డుపడ్డారు.

Telangana : ‘రేవంత్ రెడ్డి ఓ దుర్మార్గుడు, బ్లాక్ మెయిలర్..నన్నుబెదిరించాడు..అతను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మటాష్..’: మంత్రి మల్లారెడ్డి

పదే పదే మంత్రి మల్లారెడ్డి ప్రసంగంపై రెడ్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ మంత్రి మాత్రం మళ్లీ మళ్లీ కేసీఆర్‌ని పొగుడుతూ మాట్లాడారు. తాను అబద్ధం చెప్పనంటూ అలాంటి అలవాటు తనకు లేదని చెప్పడంతో కార్యక్రమానికి వచ్చిన వాళ్లలో కొందరు కింద నుంచే రాళ్లు, చెప్పులు సభా వేదిక వైపు విసిరే ప్రయత్నం చేశారు. జరగబోయే చేదు అనుభవాన్ని పసిగట్టిన మంత్రి మల్లారెడ్డి.. వెంటనే తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి వేదిక దిగి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు.

ఆ సమయంలో కొందరు మంత్రి కాన్వాయ్ పై కుర్చీలు, వాటర్‌ బాటిల్స్‌ విసిరారు. మంత్రి కాన్వాయ్‌ వెంట పరుగులు తీస్తూ కుర్చీలు విసరడంతో సభా ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల సాయంతో మంత్రి మల్లారెడ్డి అక్కడి నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

ఛాన్స్ చిక్కితే చాలు.. ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ లపై దుమ్మెత్తి పోసే మంత్రి మల్లారెడ్డి.. అంతే స్థాయిలో అధికార పార్టీపై ప్రశంసలు గుప్పిస్తారు. అభివృద్ధి చేయడంలో కేసీఆర్‌కి సాటి లేరని తెగ పొగుడుతూ ఉంటారు. అలాంటి ప్రసంగమే రెడ్డి సింహ గర్జన పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో చేయడంతో రెడ్లు మండిపడ్డారు. వారి ఆగ్రహాన్ని మంత్రి కళ్లారా చూడాల్సి వచ్చింది.