తెలంగాణలో 100 ఎకరాల్లో సుమధుర గ్రూప్ ఇండస్ట్రియల్ / వేర్ హౌజ్ పార్క్.. రూ.600 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా ఈ పెట్టుబడులు పెట్టనుంది.
Sumadhura 600 crore investment in Telangana's Bharat Future City
తెలంగాణలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సుమధుర గ్రూప్ భారీ పెట్టుబడులు పెట్టనుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో జరిగిన కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు
తెలంగాణ ప్రభుత్వంతో ఈ మేరకు అవవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా కంపెనీ సుమారు 100 ఎకరాల్లో రూ.600 కోట్ల పెట్టుబడులు పెట్ట ఇండస్ట్రియల్/ వేర్ హౌస్ పార్క్ ను నెలకొల్పనుంది. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా ఈ పెట్టుబడులు పెట్టనుంది. సుమారు రెండేళ్ల వ్యవధిలో గ్రేడ్ ఏ ప్లస్ వేర్ హౌస్ పార్క్ ను నిర్మించడానికి కంపెనీ కంకణం కట్టుకుంది. గ్లోబల్ మ్యాను ఫ్యాక్చరింగ్ కంపెనీలను ఆకట్టుకోవడం, స్థానికంగా ఉన్న కంపెనీలకు తోడ్పాటు అందించేందుకు ఈ ఇండస్ట్రియల్, వేర్ హౌస్ పార్క్ ఉపయోగపడనుంది.
ఏరో స్పేస్, ఆటోమొబైల్, ఫార్మా, ఈ కామర్స్ సంస్థలు జస్ట్ ఇక్కడ ప్లగ్ అండ్ ప్లే ద్వారా తమ కార్యకలాపాలు కొనసాగించవచ్చు. ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా సుమారు 8,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఆ తర్వాత దశల వారీగా ఇంకా ఉద్యోగాలు, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ఇన్ ఫ్రాలో గ్లోబల్ స్టాండర్డ్స్ ను అందుకొనేలా ఈ ప్రాజెక్టును నిర్మించనుంది సుమధుర గ్రూప్. యూజర్ కి కావాల్సినవన్నీ అందుబాటులో ఉంటాయ. పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రాజెక్టును నిర్మిస్తారు. ఈ కామర్స్ కంపెనీల కోసం ప్రత్యేకంగా లాజిస్టిక్స్ జోన్ ఉంటుంది. ఇంటర్నల్ ఇన్ ఫ్రా కూడా అద్భుతంగా తీర్చిదిద్దనుంది కంపెనీ.
ఇన్ ఫ్రా చరిత్రలో ఒక మైలురాయి లాంటి ఈ ఒప్పందం సందర్భంగా సుమధుర గ్రూప్ వైస్ చైర్మన్ కలకుంట్ల రామారావు కీలక విషయాలు వెల్లడించారు. ‘ఇండస్ట్రియల్ ట్రాన్స్ ఫర్మేషన్ కి వరల్డ్ క్లాస్ ఇన్ ఫ్రా అనేది మూలం అని సుమధుర కంపెనీ భావిస్తుంది. మేం చేపట్టబోయే ఇండస్ట్రియల్ పార్క్ లో కూడా టెక్నాలజీలో గ్లోబల్ బెంచ్ మార్క్ డిజైన్లు ఉంటాయి. వరల్డ్ క్లాస్ టెక్నాలజీ ఉంటుంది. ఆపరేషన్స్ కూడా అదే స్థాయిలో ఉంటాయి. తెలంగాణ గ్రోత్ పాలసీకి అనుగుణంగా ఈ పెట్టుబడులు ఉంటాయి. దీని వల్ల హై వాల్యూ వెంచర్స్ ఇక్కడకు రావడానికి ఉపయోగపడుతుంది. వేలాది ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఫలితంగా ఆర్థిక పురోభివృద్ధికి వీలవుతుంది. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి కూడా ఈ ప్రాజెక్టు దోహదపడుతుంది.’ అని కలకుంట్ల రామారావు తెలిపారు.
‘గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు తెలంగాణ కేంద్రంగా నిలుస్తోంది. ఈ ఒప్పందం ద్వారా అది మరింత పురోగమిస్తుంది. భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా ఈ ఎకోసిస్టమ్ ని డెవలప్ చేస్తున్నాం. ఏరో స్పేస్, ఆటోమోటివ్, ఫార్మా, ఈ కామర్స్ కంపెనీలు తక్కువ ఖర్చుతో ఆపరేషన్స్ నిర్వహించుకోవచ్చు. ఓ పెద్ద లాజిస్టిక్స్ నెట్ వర్క్ ని బిల్డ్ చేయడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచడానికి కృషి చేస్తున్నాం.’ అని సుమధుర గ్రూప్ ఇండస్ట్రియల్ & వేర్ హౌసింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ కరంగుల వంశీకృష్ణ అన్నారు.
సుమధుర గ్రూప్ ప్రయాణం..
మూడు దశాబ్దాల క్రితం సుమధుర గ్రూప్ ప్రయాణం ప్రారంభమైంది. అనుకున్న గడువుకంటే ముందే డెలివరీ చేయడం, హై క్వాలిటీ, స్మార్ట్ డిజైన్లతో దక్షిణాదిలో ఓ మంచి పేరు తెచ్చుకుంది. కేవలం గృహవినియోగదారులే కాకుండా వ్యాపార సంస్థలకు కూడా అనువుగా ఉండే నిర్మాణాలను ఎన్నో చేపట్టింది. బెంగళూరు, హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగంలో ఈ సంస్థ సుమారు 54 ప్రాజెక్టులు చేపట్టింది. 13 మిలియన్ చదరపు అడుగుల నుంచి 40 మిలియన్ చదరపు అడుగుల స్థాయి వరకు ప్రాజెక్టులు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. రెసిడెన్షియల్, వేర్ హౌసింగ్, కమర్షియల్, కో లివింగ్ ఇలా రియల్ ఎస్టేట్ లో భిన్న విభాగాల్లోకి సంస్థ వేళ్లూనుకుంది. ఒక రకంగా ‘సంతోషానికి పునాది’ అనేది ఈ కంపెనీ విధానం.
