Academic Year Calendar : తెలంగాణ 2022-23 విద్యా సంవ‌త్స‌రం క్యాలెండ‌ర్‌ విడుద‌ల

1 నుంచి 9 త‌ర‌గతుల‌కు ఎస్ఏ-2 ప‌రీక్ష‌ల‌ను ఏప్రిల్ 10 నుంచి 17 వ‌ర‌కు నిర్వ‌హించాల‌ని స్కూల్ ఎడ్యుకేష‌న్ ప్ర‌క‌టించింది. ఫిబ్ర‌వ‌రి 28 లోపు టెన్త్ స్టూడెంట్స్‌కు ప్రీ ఫైన‌ల్ ఎగ్జామ్స్ నిర్వ‌హించ‌నున్నారు.

Academic Year Calendar : తెలంగాణ 2022-23 విద్యా సంవ‌త్స‌రం క్యాలెండ‌ర్‌ విడుద‌ల

Calender

academic year calendar : 2022-23 విద్యా సంవ‌త్స‌రానికి సంబంధించిన‌ క్యాలెండ‌ర్‌ విడుదల అయింది. బుధ‌వారం (జూన్29,2022) తెలంగాణ స్కూల్ ఎడ్యుకేష‌న్ డిపార్ట్‌మెంట్ విడుద‌ల చేసింది. ఈ విద్యా సంవ‌త్స‌రంలో 1 నుంచి 10వ త‌ర‌గ‌తి వ‌ర‌కు మొత్తం 230 ప‌ని దినాలు ఉంటాయ‌ని ప్ర‌క‌టించింది. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 24వ తేదీ వ‌ర‌కు పాఠ‌శాల‌లు కొన‌సాగ‌నున్నాయి. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వ‌ర‌కు వేసవి సెలవులు ఉండ‌నుంది.

మొద‌టి ఎఫ్ఏ ప‌రీక్ష‌లు జులై 21 లోపు, రెండవ ఎఫ్ఏ ప‌రీక్ష‌లు సెప్టెంబ‌ర్ 5 లోపు నిర్వ‌హించాల‌ని స్కూల్ ఎడ్యుకేష‌న్ సూచించింది. ఇక ఎస్ఏ-1ప‌రీక్ష‌లు న‌వంబ‌ర్ 1 నుంచి 7వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. ఎఫ్ఏ-3 ఎగ్జామ్స్ డిసెంబ‌ర్ 21 లోపు, ఎఫ్ఏ -4 ప‌రీక్ష‌ల‌ను 10వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు జ‌న‌వ‌రి 31 లోపు, 1 నుంచి 9వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ఫిబ్ర‌వ‌రి 28 లోపు నిర్వ‌హించనున్నారు.

TET Final Key : తెలంగాణ TET ఫైనల్ ‘కీ’ రిలీజ్

1 నుంచి 9 త‌ర‌గతుల‌కు ఎస్ఏ-2 ప‌రీక్ష‌ల‌ను ఏప్రిల్ 10 నుంచి 17 వ‌ర‌కు నిర్వ‌హించాల‌ని స్కూల్ ఎడ్యుకేష‌న్ ప్ర‌క‌టించింది. ఫిబ్ర‌వ‌రి 28 లోపు టెన్త్ స్టూడెంట్స్‌కు ప్రీ ఫైన‌ల్ ఎగ్జామ్స్ నిర్వ‌హించ‌నున్నారు. ఎస్ఎస్ సీ బోర్డు ఎగ్జామ్స్ మార్చి నెల‌లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్లడించింది.

ద‌స‌రా సెల‌వులు – అక్టోబ‌ర్ 26 నుంచి న‌వంబ‌ర్ 10వ తేదీ వ‌ర‌కు(14 రోజులు). క్రిస్మ‌స్ సెల‌వులు – డిసెంబ‌ర్ 22 నుంచి 28 వ‌ర‌కు(7 రోజులు). సంక్రాంతి సెల‌వులు – జ‌న‌వ‌రి 13 నుంచి 17 వ‌ర‌కు(5 రోజులు).