పరీక్షలపై విద్యార్థులు, పేరెంట్స్ కు బిగ్ అలర్ట్.. SA2 టైం టేబుల్ మారింది.. కొత్త షెడ్యూల్ ఇదే…

SA2 Time Table 2026 : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహించే విద్యా సంవత్సరం చివరి పరీక్షల (SA-2) తేదీల్లో మార్పులు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana School SA 2 exam new Time Table 2026

  • తెలంగాణలోని స్కూల్ విద్యార్థులకు అలర్ట్
  • ‘ఎస్ఏ-2’ పరీక్షల తేదీలు మార్పు
  • ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్

SA2 Time Table 2026 : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహించే విద్యా సంవత్సరం చివరి పరీక్షల (SA-2) తేదీల్లో మార్పులు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read : Telangana Govt : రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం.. రెండు లక్షల మందికి శుభవార్త..

గత ఫిబ్రవరిలో విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం.. ఈ పరీక్షలు ఏప్రిల్ 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగాల్సి ఉంది. అయితే, ఏప్రిల్ – మే 2026లో నిర్వహించనున్న సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో రెగ్యులర్ పాఠశాల పరీక్షలను రెండు రోజులు ముందుకు జరిపినట్లు విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

సవరించిన షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. 1 నుంచి 7వ తరగతుల వారికి ఉదయం 9గంటల నుంచి 11.30 గంటల వరకు, 8వ తరగతి వారికి ఉదయం 9గంటల నుంచి 11.45 గంటల వరకు, 9వ తరగతి విద్యార్థులకు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

పరీక్షలు ముగిసిన తరువాత విద్యార్థుల ప్రతిభను తల్లిదండ్రులకు వివరించడానికి విద్యాశాఖ ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా.. ఏప్రిల్ 23న రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో తప్పనిసరిగా తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యార్థుల మార్కులు, వారి వార్షిక ఫలితాలను ప్రకటించి, వేసవి సెలవుల అనంతరం తదుపరి విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలను వివరిస్తారు.