Telangana Students: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. విద్యార్థుల ఖాతాల్లోకే ఆ డబ్బులు.. సవరణ మార్గదర్శకాలు జారీ..
Telangana Students Fee Reimbursement: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కాలర్ షిప్, ఫీజురీయింబర్స్‌మెంట్ నగదును విద్యార్థుల ఖాతాల్లోకి జమ చేయాలని నిర్ణయించింది.
Telangana Govt Students Fee Reimbursement
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- విద్యార్థుల ఖాతాల్లోకి స్కాలర్ షిప్, ఫీజురీయింబర్స్‌మెంట్
- సవరణ మార్గదర్శకాలు జారీ
Telangana Students Fee Reimbursement: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కాలర్ షిప్, ఫీజురీయింబర్స్‌మెంట్ నగదును విద్యార్థుల ఖాతాల్లోకి జమ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సవరణ మార్గదర్శకాలు జారీ చేసింది.
Also Read : 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. గెలుపు ఎవరిది? ఆసక్తికరంగా ఎగ్జిట్ పోల్స్..
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగులైన విద్యార్థులకు మంజూరు చేసే పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్‌లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు నేరుగా విద్యార్థుల ఖతాల్లోకి వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి గతంలో విడుదల చేసిన మార్గదర్శకాల్లో కొన్ని సవరణలు చేస్తూ బుధవారం కొత్త ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. ఈ మేరకు సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్ ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యార్థుల ఉపకార వేతనాలు, ట్యూషన్ ఫీజు దుర్వినియోగం కాకుండా ఆధార్‌తో లింక్ అయిన బ్యాంక్ ఖాతా నెంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్‌ను సంబంధిత జిల్లా సంక్షేమ అధికారులు పరిశీలించాలి. ఇంటర్మీడియట్ బోర్డు, ఉపాధి కల్పన అధికారి, ఉన్నత విద్యాశాఖ, సాంకేతిక విద్యాశాఖ, కళాశాలలు, యూనివర్శిటీలు, సంస్థలు నోడల్ ఆఫీసర్ ను నియమించాలి. సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు సంక్షేమ శాఖల అధికారులతో కలిసి విద్యార్థులు చదువు కొనసాగిస్తున్నట్లు నమోదు చేయాల్సి ఉంటుంది.
ఇదిలాఉంటే.. రాష్ట్రంలోని పేద విద్యార్థులు ఎదుర్కొంటున్న స్కాలర్ షిప్ నిధుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. విద్యార్థుల చదువుకు ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు. అందుకే స్కాలర్ షిప్ విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి.. అర్హులైన ప్రతి విద్యార్థికి సకాలంలో నిధులు అందేలా చూస్తామని, చెప్పారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న విద్యార్థులకు పెద్ద ఉపశమనం కలగనుంది.
