HCA T20 League: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో TG20 లీగ్.. లోగో ఆవిష్కరణ
తెలంగాణ యువ క్రికెటర్లకు అంతర్జాతీయ వేదిక లక్ష్యంగా గ్రామీణ ప్రతిభ వెలికితీసేందుకు HCA చర్యలు చేపట్టింది.
HCA T20 League: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘TG20’ లీగ్ జరగనుంది. బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో టీజీ 20 లోగో ఆవిష్కరించారు HCA మెంబర్స్. జస్టిస్ నవీన్‌రావు, డీజీపీ సీవీ ఆనంద్, సినీ నటులు వెంకటేష్, శ్రీకాంత్, క్రికెటర్ అంబటి రాయుడు, చాముండేశ్వరి నాథ్, పలువురు క్రికెట్ క్లబ్ మెంబర్స్ ఇందులో పాల్గొన్నారు.
తెలంగాణ యువ క్రికెటర్లకు అంతర్జాతీయ వేదిక లక్ష్యంగా గ్రామీణ ప్రతిభ వెలికితీసేందుకు HCA చర్యలు చేపట్టింది. CATCH కార్యక్రమం ద్వారా టాలెంట్ హంట్ ప్రారంభించింది. ఐపీఎల్ తరహాలో త్వరలో తెలంగాణ టీ20 లీగ్ నిర్వహించనున్నారు. BCCI మార్గదర్శకాలకు అనుగుణంగా టోర్నీ నిర్వహిస్తోంది. జూన్-జూలై 2026లో TG టీ20 లీగ్ తొలి సీజన్ ప్రారంభం అవుతుంది. టోర్నీలో 8 టీమ్‌లు పాల్గొననున్నాయి. 32 మ్యాచ్‌లతో లీగ్ నిర్వహించనున్నారు. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌లు జరగనున్నాయి. రౌండ్ రాబిన్ + ప్లేఆఫ్ ఫార్మాట్ ఉంటుంది. కార్పొరేట్ రంగం నుంచి భారీ స్పందన వస్తోంది. యువ క్రికెటర్లకు గుర్తింపు, కెరీర్ గ్రోత్‌కు అవకాశం ఉంటుంది. IPL స్థాయి అవకాశాల వైపు అడుగు పడినట్లైంది. 8 టీమ్‌ల కోసం 40 ప్రముఖ కంపెనీలు పోటీ పడుతున్నాయి.
టాలెంటెడ్ ప్లేయర్స్ వెలుగులోకి వస్తారని, ఈ టోర్నీ చాలా మంచి ఐడియా అని జస్టిస్ నవీన్‌రావు అన్నారు. 94 ఏళ్ల నుంచి HCA సేవలు అందిస్తోందని అంబటి రాయుడు తెలిపారు. లోకల్ ప్లేయర్స్‌ను IPLలోకి తీసుకోవాలని SRH టీమ్‌ను కోరారు అంబటి రాయుడు.
