Telangana Secretariat: సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన కేసీఆర్..

రాజధాని హైదరాబాద్ వేదికగా నిర్మిస్తున్న నూతన సచివాలయ నిర్మాణ పనులను సమీక్షించారు సీఎం కేసీఆర్. స్వయంగా వచ్చి పరిశీలించడంతో పాటు మెయిన్ గేటు ఏర్పాటుకు సంబంధించిన అంశాలను గమనించారు. దాదాపు రెండున్నర గంటలకు పైగా కొత్త అక్కడే ఉన్నారు.

Telangana Secretariat: సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన కేసీఆర్..

Telangana Secretariat Hyd

Updated On : August 7, 2021 / 8:13 PM IST

Telangana Secretariat: రాజధాని హైదరాబాద్ వేదికగా నిర్మిస్తున్న నూతన సచివాలయ నిర్మాణ పనులను సమీక్షించారు సీఎం కేసీఆర్. స్వయంగా వచ్చి పరిశీలించడంతో పాటు మెయిన్ గేటు ఏర్పాటుకు సంబంధించిన అంశాలను గమనించారు. దాదాపు రెండున్నర గంటలకు పైగా కొత్త అక్కడే ఉన్నారు.

సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్, వాస్తు నిపుణులు సుధాకర్ తేజ విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రులు, అధికారులు, షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. సచివాలయ నిర్మాణ పనులు

వేగంగా చేపట్టాలంటూ ఆదేశించారు సీఎం కేసీఆర్. నిర్మాణంలో సాంకేతికపరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని సీఎం ఆరా తీశారు. ఆలస్యమైనా సాంకేతికపరమైన విజ్ఞానాన్ని వాడుకొని పనులు చేపట్టాలని సూచించారు. మెయిన్ గేటులో తలపెట్టిన స్వల్ప మార్పులను ప్రత్యేకంగా పరిశీలించారు కేసీఆర్.