Telangana SEC: తెలంగాణ ఎన్నికల సంఘం కీలక నోటిఫికేషన్..

తుది ఓటర్ల జాబితా ఎస్ఈసీకి అందజేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

Telangana SEC: తెలంగాణ ఎన్నికల సంఘం కీలక నోటిఫికేషన్..

Updated On : November 19, 2025 / 10:40 PM IST

Telangana SEC: తెలంగాణ ఎన్నికల సంఘం కీలక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ కసరత్తు చేస్తోంది. ఓటర్ల జాబితా సవరణకు మరోసారి నోటిఫికేషన్ ఇచ్చింది. రేపటి నుంచి అభ్యంతరాలను స్వీకరించబోతోంది. ఈ నెల 22లోగా అభ్యంతరాల పరిష్కారాలకు ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 23న తుది ఓటర్ల జాబితాను ప్రకటించబోతోంది. తుది ఓటర్ల జాబితా ఎస్ఈసీకి అందజేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

గ్రామ పంచాయతీ ఓటరు జాబితాల రీ-వెరిఫికేషన్ కు ఆదేశాలు ఇచ్చింది. గ్రామ పంచాయతీ ఫోటో ఓటరు జాబితాల పునఃపరిశీలన, పునఃప్రచురణకు ఆదేశాలు ఇచ్చింది. మిస్ మ్యాపింగ్ సవరణకు DPOలకు స్పష్టమైన సూచనలు చేసింది. 20న ఓటర్ల అభ్యంతరాల స్వీకరణ ప్రారంభం. 22న అభ్యంతరాల పరిష్కారం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ. 23న తుది ఫోటో ఓటర్ల జాబితాల మళ్లీ ప్రకటన. రీ-పబ్లికేషన్ రోజున పోలింగ్ స్టేషన్ల రీపబ్లికేషన్ చేయాలంది. తుది జాబితాలు 23న SECకు అందజేయాలంది. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు ఏర్పాట్లు చేయాలని.. అన్ని MPDOలు, ADEAs తక్షణ చర్యలు చేపట్టాలంది.