Telangana : రాజ్ భవన్ లో జరిగింది ప్రజా దర్బార్ కాదు పొలిటికల్ దర్బార్..
టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గవర్నర్ మహిళా దర్బార్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ నిర్వహించింది ప్రజా దర్బార్ కాదని..అది పూర్తిగా పొలిటికల్ దర్బార్ అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ పదవులను తాము గౌరవిస్తాం అని అంటూనే గవర్నర్ తన గౌరవాన్ని కాపాడుకోలేకపోతున్నారంటూ ఎద్దేవా చేశారు.

Trs Mla Vivekananda Harsh Comments On Governors Mahila Darbar
TRS MLA Vivekananda harsh comments on governors mahila darbar : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్ భవన్ వేదికగా మహిళా దర్బార్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దర్భార్ లో గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తూ..టీఆర్ఎస్ ప్రభుత్వంపై సెటర్లు వేశారు. రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్ ముగిసిందో, లేదో.. ఆ కార్యక్రమంపై అధికారి టీఆర్ఎస్ విరుచుకుపడింది. గవర్నర్ పై విమర్శల దాడి చేశారు టీఆర్ఎస్ ఎమ్మెలు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గవర్నర్ మహిళా దర్బార్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ నిర్వహించింది ప్రజా దర్బార్ కాదని..అది పూర్తిగా పొలిటికల్ దర్బార్ అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ పదవులను తాము గౌరవిస్తాం అని అంటూనే గవర్నర్ తన గౌరవాన్ని కాపాడుకోలేకపోతున్నారంటూ ఎద్దేవా చేశారు వివేకానంద. గవర్నర్ వ్యవస్థను రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. గవర్నర్ లక్ష్మణ రేఖ దాటినా కూడా తాము సహనంతోనే ఉంటున్నామని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రం తెలంగాణ హక్కులను కాలరాస్తోంది అంటూ మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
కాగా ప్రజా దర్భార్ ను కొనసాగించి తీరుతాను అంటూ గవర్నర్ స్పష్టంచేశారు. ఈ దర్భార్ వేదికగా తనకు అందిన ఫిర్యాదులను పరిశీలిస్తానని..సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బాధ్యతా రహితంగా వ్యవహరిస్తోందంటూ గవర్నర్ అన్నారు. అంతేకాకుండా రాజ్‌భవన్‌ను గౌరవించాలని కూడా ఆమె ప్రభుత్వానికి సూచించారు.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలోనే తాము ముందుగా ‘మహిళా దర్బార్’ నిర్వహిస్తున్నామని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. గవర్నర్ ఆధ్వర్యంలో నేడు రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ… మహిళలకు అండగా ఉండాలనే ‘మహిళా దర్బార్’ నిర్వహిస్తున్నామని, అంతేగానీ, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని చెప్పారు. తాము ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారని గవర్నర్ తమిళిసై అన్నారు.