Doctors ends life : సెల్ఫీ దిగుతూ చెరువులో పడి ఇద్దరు డాక్టర్లు మృతి

తెలంగాణాలోని మేడ్చల్‌ జిల్లా శామీర్ పేట్ చెరువులో ప్రమాదశాత్తు పడి ఇద్దరు డాక్టర్లు మృతి చెందారు. సెల్ఫీ దిగుతుండగా ఇద్దరు డాక్టర్లు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు.

Doctors ends life : సెల్ఫీ దిగుతూ చెరువులో పడి ఇద్దరు డాక్టర్లు మృతి

Doctors End Life

Updated On : June 21, 2021 / 3:26 PM IST

Doctors ends life : తెలంగాణాలోని మేడ్చల్‌ జిల్లా శామీర్ పేట్ చెరువులో ప్రమాదశాత్తు పడి ఇద్దరు డాక్టర్లు మృతి చెందారు. సెల్ఫీ దిగుతుండగా ఇద్దరు డాక్టర్లు ప్రమాదవశాత్తు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు.చెరువు వద్దకు వెళ్లిన డాక్టర్లు గౌతమ్,నందన్ లు ఇద్దరు అన్నదమ్ములు. సెల్ఫీలు దిగుతుండగా ఇద్దరూ చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు. సెల్ఫీలు దిగుతుండగా ఒకరు చెరువులో పడిపోగా..అతడిని రక్షించే క్రమంలో మరొకరు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు.

ఈ విషాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన శామీర్ పేట్ చెరువు వద్దకు చేరుకుని గజఈతగాళ్లతో మృతదేహాలను వెలికి తీయించారు. ఆ డాక్టర్లు ఇద్దరూ అన్నదమ్ములుగా పోలీసులు గుర్తించారు.ఆదివారం సరదాగా గడిపేందుకు అన్నదమ్ములిద్దరు శామీర్ పేట చెరువు వద్దకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.

ఈక్రమంలో సెల్ఫీలు తీసుకునే క్రమంలో ఇద్దరూ చెరువులో పడి చనిపోయారు.డాక్టర్ల బైక్‌,బ్యాగులు, సెల్‌ఫోన్లు చెరువుగట్టుపై ఉండటంతో వారిని డాక్టర్లుగా పోలీసులు గుర్తించారు. ఇద్దరి మృతదేహాల కోసం గజఈతగాళ్ల సాయంతో వెలికి తీయించారు.