Telangana : పోలీసుల అదుపులో..డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో రూ.కోట్లు వసూలు చేసిన మహిళ
డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఆశ చూపి పేదల నుంచి అక్రమంగా కోట్ల రూపాయలు వసూలు చేసిన బొల్లేపల్లి లక్ష్మి అనే మహిళను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితులరాలు షేక్ షకీనా కోసం గాలిస్తున్నారు.

Two Women Cheated On Giving Double Bed Room Houses
khammmam two women cheated on giving double bed room houses : పేదలకు, నిరుపేదలకు సొంత ఇల్లు కల. ఎప్పటికైనా తాము సొంతగా ఓ ఇల్లు సంపాదించుకోగలమా? అనే ఆశ. కానీ అదే ఆశ ఓ కొంతమంది మాయగాళ్లకు..కాదు కాదు మాయ‘లేడీ’లకు వరంగా మారింది. పేదల అవసరాలను తమకు అనుకూలంగా చేసుకుని ఇద్దరు మాయలేడీలు పేదలను దోపిడీ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని ఒక్కొక్కరి వద్ద రూ.30వేలు వసూలు చేశారు. అలు పలవురిని నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఇదికాస్తా పోలీసులకు తెలియటంతో ఒక ఖిలాడీ లేడీని పట్టుకోగా..మరో మహిళ పరారైంది. ఖమ్మం జిల్లాలో వెలుగు చూసిందీ మాయ లేడీల ఘటన.
డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఆశ చూపి పేదల నుంచి అక్రమంగా కోట్ల రూపాయలు వసూలు చేసిన బొల్లేపల్లి లక్ష్మిని ఖమ్మం పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరో నిందితులరాలు షేక్ షకీనా రాజస్థాన్ కు పారిపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో పోలీసులు షకీనా గురించి గాలిస్తున్నారు.
ఖమ్మం పుట్టకోటకు చెందిన బొల్లేపల్లి లక్ష్మీ, ఖిల్లా ప్రాంతానికి చెందిన షేక్ షకీనాబేగం నగరంలోని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పిస్తామని ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.30 వేలు వసూళ్లు చేశారు. నగరం నడిబొడ్డున టేకులపల్లిలో నిర్మించే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఇల్లు ఇప్పిస్తామని దీంతోపాటు బ్యాంకు రుణం కూడా ఇప్పిస్తామని చెప్పి బాధితులకు మాయమాటలు చెప్పారు. వీరి మాటలు నమ్మిన పేదలు వీరిని నమ్మి డబ్బులు ఇచ్చారు. రూ.30 వేలు కడితే లక్షల విలువ చేసే డబుల్ బెడ్‌రూమ్‌తోపాటు బ్యాంకు రుణం కూడా వస్తుందని బావించిన బాధితులు వీరికి డబ్బులు చెల్లించారు.
పేదలు, మధ్యతరగతి కుటుంబాలనే టార్గెట్‌గా చేసుకున్న ఈ ఇద్దరు మహిళలు, నగరంలోని ఖానాపురం, పాండురంగాపురం ప్రాంతంలో వందల మంది నుంచి డబ్బులు వసూళ్లు చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఖానాపురం ప్రాంతంలో రూ.70 లక్షలు, పాండురంగాపురం ప్రాంతంలో రూ.30 లక్షల వరకు వసూళ్లు చేశారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఇద్దరు మహిళలు మోహం చాటేయడంతో అనుమానం వచ్చిన బాదితులు ఇల్లు, బ్యాంకు రుణం వద్దని, తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి పెంచారు. కొన్ని రోజుల పాటు వారిని మభ్యపెడుతూ వచ్చిన మహిళలు గట్టిగా అడిగిన కొంత మందికి ప్రాంసరీ నోట్లు రాసిచ్చారు.
రూ.20 లక్షలకు ఈ ఇద్దరు మహిళలు ప్రాంసరీ నోట్లు రాసిచ్చారు. అయినా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయటంతో రంగంలోకి దిగిన పోలీసులు ఓ నిందితులరాలు బొల్లేపల్లి లక్ష్మిని అదుపలోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో నిందితులరాలు షకీనా కోసం గాలింపు ముమ్మరం చేశారు.