UPSC Civil Services Result : సివిల్స్‌లో సత్తాచాటిన తెలుగోళ్లు.. వందలోపు ర్యాంకుల్లో 10 మంది మనవాళ్లే

సివిల్ సర్వీసెస్ 2022 ప్రాథమిక పరీక్షల ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి మొత్తం 46 మంది సర్వీస్ కు ఎంపికయ్యారు.

UPSC

UPSC Civil Services Result : దేశంలోనే అత్యున్నతంగా భావించే సివిల్ సర్వీసెస్‌లో అమ్మాయిలు సత్తాచాటారు. అఖిల భారత సర్వీసుల్లో నియామకాలకోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ -2022 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువశాతం ఉత్తీర్ణత సాధించారు. దేశ వ్యాప్తంగా దాదాపు 5.73లక్షల మంది సివిల్ సర్వీసెస్ 2022 ప్రాథమిక పరీక్షలకు హాజరయ్యారు. వారిలో చివరకు 933 మంది సర్వీస్‌కు ఎంపికయ్యారు. వీరిలో జనరల్ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 99, ఓబీసీ నుంచి 263, ఎస్సీల నుంచి 154, ఎస్టీ విభాగం నుంచి 72 మంది ఉన్నారు.

IAS IPS Salary : ఐఏఎస్, ఐపీఎస్‌లకు శిక్షణ ఎక్కడ ఇస్తారు? ఎన్ని రోజులు ఇస్తారు? జీతం ఎంత ఇస్తారు?

సివిల్ సర్వీసెస్ 2022 ప్రాథమిక పరీక్షల ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి మొత్తం 46 మంది సర్వీస్ కు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా ఎంపికైన వారిలో 4.28శాతం తెలుగువారే ఉన్నారు. అంటే ఎంపికైన ప్రతీ 100 మందిలో నలుగురు తెలుగు అభ్యర్థులు ఉన్నారు. నారాయణపేట ఎస్పీగా పనిచేస్తున్న ఎస్. వెంకటేశ్వర్లు కుమార్తె ఉమాహారతి మూడో ర్యాంకు సాధించింది. ఈమెది సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్. ఆమెతో పాటు తెలుగు అభ్యర్థులు వందలోపు 10 ర్యాంకులు సాధించి సత్తాచాటారు. ఏపీలోని తిరుపతికి చెందిన పవన్ దత్తా 22వ ర్యాంకుతో తెలుగు రాష్ట్రాల్లో రెండో ర్యాంకు దక్కించుకున్నాడు.

Kaleshwaram : కాళేశ్వరం మహా అద్భుతం.. అమెరికా సంస్థ ప్రశంసల వర్షం

తెలుగు రాష్ట్రాల నుంచి ర్యాంకర్లు వీరే ..

నూకల ఉమాహారతి (సూర్యాపేట – 3వ ర్యాంక్), జీవీఎస్ పవన్ దత్త (తిరుపతి – 22వ ర్యాంకు), తరుణ్ పట్నాయక్ ( రాజమహేంద్రవరం -33వ ర్యాంకు), అజ్మీరా సంకేత్ కుమార్ (మంచిర్యాల జిల్లా – 35వ ర్యాంకు), శాఖమూరి శ్రీసాయి అశ్రిత్ ( హనుమకొండ – 40వ ర్యాంకు), రిచా కులకర్ణి ( హైదరాబాద్ – 54వ ర్యాంకు), ఎం. శ్రీప్రణవ్ (హైదరాబాద్ – 60వ ర్యాంకు), అంబికాజైన్ ( కర్నూల్ జిల్లా – 69వ ర్యాంకు), ఉత్కర్ష్ కుమార్ (హైదరాబాద్ 78వ ర్యాంకు), ఆవుల సాయి కృష్ణ (కరీంనగర్ 94వ ర్యాంకు), నిధి పాయ్ ( హైదరాబాద్ – 110వ ర్యాంకు), అనుగు శివమారుతి రెడ్డి ( హైదరాబాద్ 132వ ర్యాంకు), రాళ్లపల్లి వసంత్ కుమార్ ( హైదరాబాద్ 157వ ర్యాంకు), మహేశ్ కుమార్ కాంతం ( నిజామాబాద్ జిల్లా 200వ ర్యాంకు), రావుల జయసింహారెడ్డి (నిజామాబాద్ జిల్లా 217వ ర్యాంకు), కాసిరాజు పావని సాయిసాహిత్య ( విశాఖపట్టణం 243వ ర్యాంకు), అంకుర్ కుమార్ (విశాఖపట్టణం 257వ ర్యాంకు), బొల్లం ఉమామహేశ్వర్ (విశాఖపట్టణం 270వ ర్యాంకు), చల్లా కల్యాణి (విశాఖపట్టణం 285వ ర్యాంకు), పాల్వాయి విష్ణువర్దన్ రెడ్డి (విశాఖపట్టణం 292వ ర్యాంకు), గ్రంథె సాయికృష్ణ ( కొత్తగూడెం 293వ ర్యాంకు),  వీరగంధం లక్ష్మీ సుజాత (ప్రకాశం జిల్లా311వ ర్యాంకు)

 

నౌపాడు ఆశ్రిత (విశాఖపట్టణం 315 ర్యాంకు), ఎన్. చేతన్ రెడ్డి (విశాఖపట్టణం 346వ ర్యాంకు), యారగట్టి శ్రుతి ( విశాఖపట్టణం 362 ర్యాంకు), ఇప్పలపల్లి సుష్మిత ( విశాఖపట్టణం (384వ ర్యాంకు), రేవయ్య (అదిలాబాద్ జిల్లా 410వ ర్యాంకు), చంద్రశేఖర్ శంఖాల (అదిలాబాద్ జిల్లా 414వ ర్యాంకు), సీహెచ్ శ్రవణ్ కుమార్ రెడ్డి (షాద్ నగర్ 426వ ర్యాంకు), చాణక్య ఉదయగిరి ( షాద్ నగర్ 459వ ర్యాంకు), బొల్లిపల్లి వినూత్న (ఒంగోలు 462వ ర్యాంకు), సమీర్ రాజ (ఒంగోలు 464వ ర్యాంకు), బి. గోపికృష్ణ ( ఒంగోలు 480 ర్యాంకు), దామోదర హిమవంశీ ( నల్గొండ జిల్లా 548వ ర్యాంకు), రేపూడి నవీన్ చక్రవర్తి ( నల్గొండ జిల్లా 550వ ర్యాంకు), ఐఈఎస్ఎస్‌డి మనోజ్ ( ఖమ్మం జిల్లా 559వ ర్యాంకు), ఎస్. దీప్తి చౌహాన్ ( నిజామాబాద్ జిల్లా 630వ ర్యాంకు), తుమ్మల సాయికృష్ణా రెడ్డి ( నిజామాబాద్ జిల్లా 640 వ ర్యాంకు), పుసులూరు రవికిరణ్ ( నిజామాబాద్ జిల్లా 694వ ర్యాంకు), రామ్‌దేని సాయినాథ్ ( హైదరాబాద్ 742 ర్యాంకు), జి. అక్షయ్ దీపక్ ( హైదరాబాద్ 759 ర్యాంకు), పోతుపురెడ్డి భార్గవ్ ( విజయనగరం 772వ ర్యాంకు), కల్లం శ్రీకాంత్ రెడ్డి ( విజయనగరం 801వ ర్యాంకు), బెండుకూరి మౌర్యతేజ్ ( విజయనగరం 846వ ర్యాంకు), నాగుల కృపాకర్ ( వైఎస్ఆర్ జిల్లా 866వ ర్యాంకు), కొయ్యడ ప్రణయ్ కుమార్ ( జనగాం జిల్లా 885వ ర్యాంకు)