Congress, BJP Attack : హనుమకొండ బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత..కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పరస్పర దాడి

ఇరు పార్టీల కార్యకర్తల పరస్పర దాడులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరస్పర దాడులతో అక్కడ వారిని అదుపు చేసేందుకు వెళ్లిన పోలీసులకు గాయాలయ్యాయి.

Congress, BJP Attack : హనుమకొండ బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత..కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పరస్పర దాడి

Bjp Attack (1)

Updated On : July 1, 2022 / 7:59 PM IST

Congress, BJP Attack : అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసింది. హనుమకొండ బీజేపీ కార్యాలయం దగ్గర కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టడంతో బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ శ్రేణులు, వాహనాలపై దాడికి దిగారు. కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీ కార్యకర్తలపై ఎదురుదాడికి దిగటంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.

ఇరు పార్టీల కార్యకర్తల పరస్పర దాడులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరస్పర దాడులతో అక్కడ వారిని అదుపు చేసేందుకు వెళ్లిన పోలీసులకు గాయాలయ్యాయి.

Telangana: హ‌నుమ‌కొండ‌లో నిరసనల‌ పేరుతో కాంగ్రెస్ దాడులకు తెగబడింది: ఎంపీ ఓం ప్రకాశ్

కేయూ సీఐ సుధాకర్‌ రెండు పార్టీల శ్రేణులను అదుపు చేసే క్రమంలో గాయపడ్డారు. సుబేదారి సీఐ గన్‌మెన్ తలకు కూడా గాయమైంది. పరిస్థితి అదుపు తప్పటంతో పోలీసులు లాఠీలు ఝులిపించారు.