Suspicious Death
Suspicious Death : రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని మృతి చెందింది. ఎల్లారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అక్షిత (14) స్థానికంగా పదోతరగతి చదువుతుంది. గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులకు సమాచారం అందటంతో ఘటన స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా వెంకటాపూర్ గ్రామంలో బాలిక అమ్మమ్మ, కుటుంబీకులు అడ్డుకున్నారు.
చదవండి : Suspicious Death : మహిళ మృతి.. హెడ్ కానిస్టేబుల్‌పై అనుమానాలు
బాలికను ఎవరో హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ వారు రాస్తారోకో నిర్వహించారు. వెంటనే విచారణ చేపట్టి బాలిక మృతికి కారణమైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా బాలిక శరీరంపై గాయాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూరి సమాచారం తెలియాల్సి ఉంది.
చదవండి : Suspicious Death : విశాఖలో బాలిక అనుమానాస్పద మృతి