Suspicious Death : విశాఖలో బాలిక అనుమానాస్పద మృతి

విశాఖలోని గాజువాకలో ఓ బాలిక అనుమానస్పద రీతిలో మృతి చెందింది. నిన్న రాత్రి తొమ్మిది గంటల నుంచి కనిపించకుండా పోయిన బాలిక కోసం ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా వెతికారు.

Suspicious Death : విశాఖలో బాలిక అనుమానాస్పద మృతి

Girl Dead

Suspicious death of a girl : విశాఖలోని గాజువాకలో ఓ బాలిక అనుమానస్పద రీతిలో మృతి చెందింది. నిన్న రాత్రి తొమ్మిది గంటల నుంచి కనిపించకుండా పోయిన బాలిక కోసం ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా వెతికారు. అయితే ఆమె ఆచూకీ లభించలేదు. ఈ రోజు ఉదయం పక్క అపార్ట్‌మెంట్‌లో బాలిక మృతదేహం కనిపించడంతో తల్లిదండ్రులు షాక్‌ అయ్యారు.

ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలిక అసలు ఇంటి నుంచి ఎటు వెళ్లింది? కనిపించకుండా పోయినప్పటి నుంచి ఏం జరిగింది? అన్నది అంతుచిక్కడం లేదు. బాలిక మృతిపై తల్లిదండ్రులు దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు..

Munir : మనిషి కాదు మృగం… ఐదేళ్లలో 75మందితో పెళ్లి, 200 మంది యువతులను..

అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన పాపను ఎవరైనా కిడ్నాప్‌ చేశారా? పక్క అపార్ట్ మెంట్‌లోకి తీసుకెళ్లి చంపేశారా? 9 గంటల తర్వాత పాప అసలు ఎక్కడికి వెళ్లింది? వాచ్‌మెన్‌ కుమార్తెను చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? బాలికకు ఏదైనా ప్రమాదం జరిగిందా? లేక కావాలనే కడతేర్చారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి..

బాలిక బిల్డింగ్ మీద నుంచి పడిపోయినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు.. అయితే పాప ఆ బిల్డింగ్‌కు ఎందుకు వెళ్లిందన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.