Munir : మనిషి కాదు మృగం… ఐదేళ్లలో 75మందితో పెళ్లి, 200 మంది యువతులను..

ఇప్పటివరకు 75మందిని వివాహం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దాదాపు 200 మంది యువతులను భారత్ లోకి అక్రమ రవాణ చేసినట్లు..

Munir : మనిషి కాదు మృగం… ఐదేళ్లలో 75మందితో పెళ్లి, 200 మంది యువతులను..

Munir

Munir : ఇటీవల మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో వెలుగు చూసిన సెక్స్ రాకెట్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు మునిర్ ఇప్పటివరకు 75మందిని వివాహం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బంగ్లాదేశ్ కు చెందిన నిందితుడు దాదాపు 200 మంది యువతులను భారత్ లోకి అక్రమ రవాణ చేసినట్లు వెల్లడించారు. యువతుల పేదరికాన్ని ఆసరాగా చేసుకున్న మునిర్, వారిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపినట్లు తెలిపారు.

నిందితుడు మునిర్ బంగ్లాదేశ్ లో నివాసం ఉండేవాడు. భారత్ లోకి అక్రమంగా రావడం, మళ్లీ బంగ్లాదేశ్ కు వెళ్లడం అతడికి అలవాటు. ఈజీ మనీకి అలవాటు పడిన మునిర్.. అమాయక మహిళలను టార్గెట్ చేశాడు. వారిని పెట్టుబడిగా పెట్టి డబ్బు సంపాదించడం ప్రారంభించాడు. అలా వచ్చిన డబ్బుతో విచ్చలవిడిగా జల్సాలు చేస్తున్నాడు.

Ticket Prices : వైజాగ్ టు హైదరాబాద్ రూ.3వేలు.. టికెట్ల ధరలు భారీగా పెంపు

బంగ్లాదేశ్ కు చెందిన అమాయకులు, పేదింటి మహిళలను టార్గెట్ చేసుకున్న మునిర్ వారికి భారత్ లోని ప్రముఖ నగరాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. తర్వాత అందంగా ఉన్న అమ్మాయిలను వివాహం చేసుకోవడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత వారిని తనతో తీసుకెళ్లే వాడు. ఇలా గత ఐదేళ్లలో ఏకంగా 75 మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకోవడం కొన్ని రోజుల కాపురం చేయడం. కట్ చేస్తే, అక్రమ మార్గంలో బంగ్లాదేశ్ నుంచి వారిని భారత్ లని వెస్ట్ బెంగాల్ కి తీసుకుని వచ్చేవాడు.

CM KCR : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, 80వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ..!

కోల్ కతా లో బ్యూటీపార్లర్ లో అందంగా తయారు చేయించేవాడు. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలి, స్టైల్ గా బట్టలు వేసుకుని ఎలా ఉండాలి అని తను పెళ్లి చేసుకున్న అమ్మాయిలకు ప్రత్యేక శిక్షణ ఇప్పించాడు. ఆ తర్వాత వారిని బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టేవాడు. హైప్రోఫైల్ హోదా ఉన్న వ్యక్తులు వెళ్లే హైటెక్ వేశ్య కేంద్రాల నిర్వాహాకులకు వారిని అమ్మేసేవాడు. అలా వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు.

కాగా, 11 నెలల క్రితం ఇండోర్ పోలీసులు విజయనగర్ ఏరియాలోని ఓ వేశ్యవాటిక కేంద్రం మీద దాడి చెయ్యడంతో అక్కడ ఏకంగా 21 మంది బంగ్లాదేశ్ మహిళలు పట్టుబడ్డారు. వారి విచారిస్తే మునిర్ బండారం బయటపడింది. అందులో 12 మంది మునిర్ ను పెళ్లి చేసుకున్న వారే ఉండటంతో పోలీసులు షాక్ అయ్యారు. మునిర్ ను పట్టించిన వారికి నగదు బహుమానం ఇస్తామని అప్పట్లో పోలీసులు ప్రకటించారు.

బంగ్లాదేశ్ మహిళను వివాహం చేసుకున్న మునిర్ ఆమెను విక్రయించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో సూరత్ పోలీసులకు చిక్కాడు. కిలాడీ మునిర్ ఇప్పటివరకు 75 మందిని పెళ్లాడి వేశ్యవాటిక కేంద్రాల్లో అమ్మేశాడని తెలిసి పోలీసులే విస్తుపోయారు. తాను పెళ్లాడిన 75 మందితో పాటు ఇప్పటి వరకు 200 మంది మహిళలను వేశ్యవాటిక కేంద్రాల్లో విక్రయించినట్టు పోలీసుల విచారణలో మునిర్ అంగీకరించడం కలకలం రేపింది. మునిర్ సెక్స్ రాకెట్ దందా వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసుని సవాల్ గా తీసుకున్న పోలీసులు మునిర్ ను విచారిస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయంటున్నారు.