CM KCR : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, 80వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ..!

నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేశారు. 2, 3 నెలల్లో ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని అసెంబ్లీలో తెలిపారు కేసీఆర్‌. దాదాపు 80

CM KCR : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, 80వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ..!

Cm Kcr Jobs

CM KCR : నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేశారు. 2, 3 నెలల్లో ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు కేసీఆర్‌. దాదాపు 80వేల ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశముందని ఆయన వెల్లడించారు. కొత్త జోనల్ విధానం ప్రకారం 95శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయని కేసీఆర్ అన్నారు. ఇప్పుడున్న ఉద్యోగులను ఎవరి జోన్లకు వారిని పంపాక, ఏర్పడిన ఖాళీలతో కలిపి ఉద్యోగాలు భర్తీ చేస్తామని వివరించారు.

Facebook Outage : ఆమె లైవ్‌లో కనిపించింది అంతే.. క్షణాల్లో ఫేస్‌బుక్ సర్వీసులన్నీ బంద్..!

తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రానున్న ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని, మళ్లీ తమ ప్రభుత్వమే వస్తుందని కేసీఆర్ జోస్యం చెప్పారు. ”కొందరు అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారు. ఎవర్ని ప్రభుత్వంలో ఉంచాలో ప్రజలకు బాగా తెలుసు. మాకు అంచనాలు, సర్వేలు ఉన్నాయి. మా ప్రభుత్వమే కొనసాగుతుంది. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే ప్రజలు మమ్మల్ని ఎందుకు పక్కన పెడతారు? ఏ కారణంతో పక్కన పెడతారు? మాకు ఆత్మవిశ్వాసం ఉంది” అని కేసీఆర్ అన్నారు.

Blood Thinners: రక్తాన్ని పలుచగా చేసే ఇవి..50 శాతం కరోనా మరణాలు తగ్గిస్తున్నాయి : తాజా పరిశోధనలో వెల్లడి

ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు దళితబంధు కేవలం హుజూరాబాద్ కోసమే పెట్టలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ”దళితబంధు హుజూరాబాద్ కోసం తీసుకొచ్చింది కాదు. 1986లోనే ఈ పథకం పురుడుపోసుకుంది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు దళితుల పరిస్థితి దయనీయంగా ఉంది. 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా దళితుల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు. స్వాతంత్ర్యానికి ముందు కూడా హింసకు గురయ్యారు. అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మేము ఇప్పటివరకు కొంతమేర చేయగలిగాము. దళితబంధుపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. ఎస్సీ కార్పొరేషన్ తో బాగుపడ్డోడు ఒక్కడూ లేడు. భూములు అమ్ముతుంటే రాష్ట్రానికి మంచి ఆదాయం వస్తోంది. వచ్చే బడ్జెట్‎లో దళితబంధుకు రూ.20 వేల కోట్లు కేటాయిస్తాం. నియోజకవర్గానికి 100 మంది లబ్దిదారులను ఎంపిక చేయడం ఎమ్మెల్యేల ఇష్టమే’ అని అసెంబ్లీలో దళితబంధుపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌ అన్నారు.